AP alliance vs YSRCP: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంపై దృష్టి పెట్టింది. కీలక పథకాలకు శ్రీకారం చుట్టింది. మరోవైపు పాలనాపరంగా కూడా దూసుకుపోతోంది. అమరావతి రాజధాని తో పాటు పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు మౌలిక వసతుల కల్పన కూడా జరుగుతోంది. అన్నింటికీ మించి భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సైతం ఏర్పాటు అవుతున్నాయి. ఇవి సన్నాహాలు ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ప్రారంభం కావడం ఖాయం. అదే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతోంది. ఈ విషయంలో ఏం చేయాలో ఆ పార్టీకి పాలు పోవడం లేదు.
ఆ భయంతోనే..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఇంకా సంక్షేమ పథకాలు అమలు ప్రారంభం కాలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆక్షేపిస్తూ వస్తోంది. అయితే రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అయినా సరే ప్రజలు తిరస్కరించారు. అభివృద్ధి లేదన్న అపవాదుతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఒకవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తోంది. ఇంకోవైపు పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అదే సమయంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇది ఎక్కడ ప్రభుత్వానికి సానుకూలతగా మారుతుందోనన్న ఆందోళన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందుకే గత ఏడాదిగా సంక్షేమ పథకాలు అమలు విషయంలో కూటమి మాట తప్పిందన్న విమర్శలు చేసింది. ఇప్పుడు పథకాలు అమలు చేస్తుండడంతో ఏం చేయాలో ఆ పార్టీకి పాలు పోవడం లేదు.
Also Read: రేపు మరో 9.51 లక్షల మందికి ‘తల్లికి వందనం’.. ఏం చేయాలంటే?
అన్నీ సానుకూలతలు..
రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి అన్నది అందరికీ తెలిసిన విషయం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం( central government) సైతం ఏపీ విషయంలో సానుకూలంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు లో ముందు వరుసలో ఉంది. అమరావతి నిర్మాణం ప్రారంభం అయింది. పోలవరం ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. మరోవైపు చంద్రబాబు బనకచర్ల అంటూ కొత్త నినాదాలు తెరపైకి తెచ్చారు. ఇవన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళనకు గురి చేసే విషయాలే. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తుండడం ఆ పార్టీకి కంటగింపుగా మారింది అన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే పెట్టుబడులు రాకుండా ఇన్వెస్టర్లకు ఈమెయిల్ రూపంలో ఫిర్యాదులు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు.
గతంలోనూ ఫిర్యాదులు..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీ గతంలో కూడా ఇటువంటి ఆరోపణలను ఎదుర్కొంది. 2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. అందరి అభిప్రాయంతో అమరావతి రాజధానిని ఎంపిక చేసింది. అప్పట్లో ప్రపంచ బ్యాంకు సాయాన్ని అర్థించింది. కానీ అమరావతి అనేది ముంపు ప్రాంతమని.. అది ఏమంత శ్రేయస్కరం కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచ బ్యాంకుకు నేరుగా ఫిర్యాదులు చేసింది. అటు తరువాత ప్రపంచ బ్యాంకు సాయాన్ని టిడిపి ప్రభుత్వం వద్దనుకుంది. అయితే ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం ష్యురిటీతో ప్రపంచ బ్యాంక్, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 15 వేల కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ప్రమేయంతో విడుదల కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసేందుకు భయపడింది. అయితే తాజాగా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయి. ఆయా యాజమాన్యాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్తున్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అయితే ఇలా పరిశ్రమలను అడ్డుకోవడం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అవ్వక తప్పదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో?