Talli ki Vandanam 2nd phase: ఏపీ ప్రభుత్వం( AP government) సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రేపు రెండో విడత తల్లికి వందనం నిధులను జమ చేయనుంది. ఒకటి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం రోజున లక్షలాదిమంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులను జమ చేసింది. అయితే ఒకటో తరగతితో పాటు ఇంటర్ ఫస్టియర్ లో చేరే విద్యార్థులకు రేపు నిధులను జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 9.51 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రేపు తల్లికి వందనం నిధులు జమ కానున్నాయి. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, సీబీఎస్సీఈ విద్యార్థులకు సంబంధించి తల్లుల ఖాతాలో 13 వేల రూపాయల చొప్పున రేపు జమ చేయనున్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభం నాడు..
ఈ ఏడాది విద్యా సంవత్సరం( academic year ) ప్రారంభం రోజున లక్షలాది మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. అయితే ఒకటో తరగతిలో ప్రవేశాలు, ఇంటర్ ఫస్టియర్ లో చేరికలు దృష్ట్యా కొంతమంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయలేదు. ఇప్పుడు అడ్మిషన్లు ఒక కొలిక్కి రావడంతో వారి ఖాతాల్లో సైతం తల్లికి వందనం పథకం కింద నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులతో పాటు ఇంటర్ ఫస్టియర్ లో చేరిన విద్యార్థుల కు నగదు సాయం అందించనుంది. ఇప్పటికే గ్రామ / వార్డు సచివాలయాలకు అర్హుల జాబితాను పంపించారు. అటు పాఠశాలల యాజమాన్యాలకు సంబంధించి కూడా ఈ జాబితాలు పంపించారు. ఈ జాబితాల ప్రాప్తికి నిధులు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: వైఎస్ఆర్ లోని ఆ గొప్పతనం బయటపెట్టిన నాగేశ్వరరావు
పెండింగ్ జాబితాలో ఉన్నవారికి..
మరోవైపు అర్హత ఉండి వివిధ కారణాల రీత్యా లక్షలాదిమంది విద్యార్థులు తల్లికి వందనం( Thalliki Vandanam ) సాయానికి దూరంగా ఉండిపోయారు. అటువంటి వారి తప్పిదాలను సరి చేసేందుకు సచివాలయాల్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. దానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. సాంకేతిక తప్పిదాలు ఉంటే వెంటనే సరి చేశారు. ఇలా సరిచేసిన వారికి సంబంధించి.. 1.35 లక్షల మందికి కూడా రేపు నిధులు జమ చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం నిధులు జమ చేస్తామని కూటమి సర్కార్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ మేరకు విద్యా సంవత్సరం ప్రారంభం రోజే పెద్ద ఎత్తున నిధులు జమ చేశారు. ఇప్పుడు మిగతా వారికి జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాసంస్థలు, సీబీఎస్ఈ సిలబస్ చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తారా లేదా అనేది అనుమానంగా ఉండేది. ఎట్టకేలకు దానిని క్లియర్ చేస్తూ పథకం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది.
Also Read: అనసూయను ఏమంటే కాలుద్దో అదే అన్నారుగా!
మెగా పేరెంట్స్ మీటింగ్
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సంబంధించి రేపు తల్లిదండ్రుల సమావేశం( Parents meeting) నిర్వహించనున్నారు. పిల్లల చదువుకు సంబంధించి తల్లిదండ్రులకు పలు అంశాల్లో అవగాహన కల్పించనున్నారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆయా పాఠశాలలు తల్లిదండ్రులకు సమాచారం అందించాయి. రేపు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరగనుంది. మరోవైపు అన్ని సచివాలయాల్లో తల్లికి వందనం రెండో విడతకు సంబంధించి అర్హుల జాబితాను ప్రదర్శించనున్నారు. మొత్తానికి అయితే తల్లికి వందనం పథకం విజయవంతంగా అమలు చేసి కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది.