Homeజాతీయ వార్తలుPolice officer Roshni: వామ్మో ఈ మహిళా పోలీస్ కు సలాం చెప్పాల్సిందే. 18 అడుగుల...

Police officer Roshni: వామ్మో ఈ మహిళా పోలీస్ కు సలాం చెప్పాల్సిందే. 18 అడుగుల కింగ్ కోబ్రాను ఇట్టే పట్టేసింది..

Police officer Roshni: కేరళకు చెందిన మహిళా అటవీ అధికారిణి జి.ఎస్. రోష్ని ఇటీవల తిరువనంతపురంలోని పెప్పరా ప్రాంతంలో 14-18 అడుగుల పొడవు, దాదాపు 20 కిలోల బరువున్న కింగ్ కోబ్రాను కేవలం 6 నిమిషాల్లో రక్షించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది ఆమె మొదటి కింగ్ కోబ్రా రెస్క్యూ, కానీ ఆమె ఈ పనిని చాలా సులభంగా, చాలా ట్రిక్‌తో చేసింది. దానిని చూసి అందరూ ముగ్ధులయ్యారు. అన్నింటికంటే, ఆమె ఉపయోగించిన ఆ ట్రిక్ ఏమిటి? అనే వివరాలు తెలుసుకుందాం. అంతేకాదు ఈ మహిళా అధికారి తన 8 సంవత్సరాల కెరీర్‌లో 800 కి పైగా విషపూరితమైన, విషం లేని పాములను సురక్షితంగా రక్షించారట కూడా. అవి కూడా తెలుసుకుందాం పదండీ.

రోష్ని 2017 నుంచి కేరళ అటవీ శాఖలో బీట్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె రక్షించిన పాములలో కొండచిలువలు, వైపర్లు, ఇతర కోబ్రా జాతులు ఉన్నాయి. దక్షిణ కేరళలో ఇది చాలా అరుదుగా కనిపించే కింగ్ కోబ్రాను మొదటిసారిగా పెట్టుకుంది. ఎన్నో పాములను పట్టుకుంది కానీ కింగ్ కోబ్రా మాత్రం ఇదే మొదటి సారి అంట. ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా ఆమె ఒక కర్ర, బ్యాగ్‌తో దీన్ని పూర్తి చేసింది. తన సాహస వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కూడా.

Also Read: కాశ్మీర్‌లో రికార్డు స్థాయిలో వేడి? ఇంతకీ ఏమైంది?

ఇంతకీ అంత పెద్ద కోబ్రాను పట్టుకోవడానికి జిఎస్ రోష్ని ఏ ఉపాయం చేసింది అనుకుంటున్నారా? గోబ్రాను పట్టుకోవడానికి జిఎస్ రోష్ని జాగ్రత్త, ఓర్పు, శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించింది. పూర్తిగా ప్రశాంతంగా ఉంటూనే ప్రమాదకరమైన, పొడవైన పాములను పట్టుకోవడానికి ఉపయోగించే సాంకేతికతను ఆమె ప్రదర్శించింది. ఆమె భయపడకుండా పాము ప్రతి కదలికను గమనించింది. ప్రశాంతత, ఓర్పు కింగ్ కోబ్రా వంటి ప్రమాదకరమైన పాము ముందు కూడా పరిస్థితిని అదుపులో ఉంచింది. ఆమె అటవీ అధికారిణి కాబట్టి, పాములను పట్టుకోవడానికి ఆమెకు సరైన శిక్షణ లభించింది. దానిని ఎలా చేయాలో ఆమెకు తెలుసు. ఆమె ఉపాయాలలో పాము పట్టే కర్ర, సంచిని ఉపయోగించడం, పాము కదలికలను గమనించడం, ఓపికతో పనిచేయడం వెన్నెతో పెట్టిన విద్య.

నిజానికి, పాము తోకను పట్టుకున్న తర్వాత, దాని కదలికను నియంత్రించవచ్చు. ఇలా చేయడం ద్వారా, పాము తన శరీరాన్ని కదిలించలేకపోతుంది. తోకను పట్టుకోవడం ద్వారా, పాము మొత్తం శరీరం కదలిక చాలా వరకు తగ్గుతుందని కూడా గమనించాలి. వాస్తవానికి, పాము వెనక్కి తిరగి కూడా దాడి చేయగలదు. కానీ దానికి ఒక పరిమితి ఉంది. అది దాని శరీరం సగం పొడవు వరకు మాత్రమే వెనక్కి తిప్పి దాడి చేస్తుంది. అందువల్ల, చాలా మంది స్నాచ్ క్యాచర్లు మొదట దానిని నియంత్రించడానికి తోకను పట్టుకుంటారు.

అయితే ఈ కింగ్ కోబ్రా విషానికి ఇప్పటికీ సరైన చికిత్స లేదు. అంతేకాదు ఈ కింగ్ కోబ్రా పొడవుగా ఉంటే, దాని ముందు నిలబడి ఉన్న వ్యక్తి ఎత్తు వరకు నిలబడి తన పడగను విస్తరించగలదు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అందుకే పాములు పట్టేవారు దాని తోకను పట్టుకునేంత వరకు వెనుకకు ఉంటారు. పాముని పట్టుకునేటప్పుడు ఎప్పుడూ దాని ముందుకు రాకూడదు. రారు కూడా.

ముఖ్యంగా పాములు పట్టుకునే కర్రను దీనికి ఉపయోగిస్తారు. రోష్ని కూడా అదే చేసింది. ఆమె ఒక పొడవైన కర్రను (పాములు పట్టుకునే కర్ర) ఉపయోగించింది. ఆమె దగ్గర మరొక కర్ర ఉంది. దాని చివర ఒక నల్ల సంచి కూడా ఉంది. ఈ కర్ర పామును సురక్షితమైన దూరం నుంచి నియంత్రించడంలో సహాయపడుతుంది. రెండవది, పామును దీని ద్వారా కూడా సంచిలోకి పెట్టవచ్చు. పామును కర్ర ద్వారా నియంత్రించినప్పుడు, అది అంచున దానికి యాడ్ చేసిన సంచిలోకి ప్రవేశిస్తుంది. కర్రను తిప్పి వెంటనే మూసివేయవచ్చు..

Also Read: పెట్రోల్, డీజిల్‌కు గుడ్‌బై.. సీఎన్‌జీ కార్లదే హవా.. టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ ఇవే

బ్యాంగ్ రండును పాము ఒక బొరియగా భావిస్తుంది. ఈ రంగు దానిని చీకటిగా భావిస్తుంది. కాబట్టి దీని రంగు నల్లగా ఉండటంతో ఇది ఈ బ్యాగులోకి హాయిగా వెళుతుంది. రోష్ని తన కర్రతో దానిని నియంత్రిస్తుండగా, కింగ్ కోబ్రా పదే పదే తన పడగను విప్పి దాడి చేయడానికి ప్రయత్నించింది. రోష్ని దానిని అలా చేయకుండా ఆపింది. కానీ చాలా నిమిషాలు ఓపికగా దానిని అలసిపోయేలా ప్రయత్నిస్తూనే ఉంది. ఇది దాని బలం, వేగం రెండింటినీ తగ్గించింది. ప్రమాదకరమైన పాములను పట్టుకోవడంలో ఈ టెక్నిక్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది పాము దూకుడును తగ్గిస్తుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.

YouTube video player

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version