AP Alliance Government: ఏపీలో( Andhra Pradesh) కూటమి ఏడాది పాలన పూర్తిచేసుకుంది. అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చింది. ఇదే ఊపుతో ముందుకెళ్తామని సంకేతాలు ఇచ్చింది. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్, పరిశ్రమల ఏర్పాటు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన వంటి అభివృద్ధి పనులు చేసి చూపిస్తోంది. ఇంకోవైపు సంక్షేమ పథకాలు సైతం అమలు చేస్తోంది. సామాజిక పింఛన్ మొత్తాన్ని పెంచింది. మూడు గ్యాస్ సిలిండర్లు అందించింది. అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. తాజాగా తల్లికి వందనం పథకం అమలు చేసింది. రేపు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనుంది. దీంతో ప్రజల్లో సంతృప్తి ప్రారంభం అయిందని అంచనా వేస్తోంది. అయితే కొన్ని సర్వేల్లో ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు బాగానే పనిచేస్తున్నా.. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని ఈ సర్వేల్లో తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: లింగయ్య మృతికి జగన్ కాన్వాయ్ కు సంబంధం లేదట..
* గతంలో కూటమికి అనుకూల ఫలితాలు
టిడిపి కూటమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైజ్ అనే సర్వే సంస్థ తరచూ సర్వే ఫలితాలను ప్రకటించేది. ప్రవీణ్ పుల్లట ( Praveen pullata ) ఎప్పటికప్పుడు ఈ సర్వే ఫలితాలను సోషల్ మీడియా వేదికగా ప్రకటించేవారు. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉందని.. కూటమికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని సర్వే ఫలితాలు ఇచ్చింది ప్రవీణ్ పుల్లట. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతాలవారీగా టిడిపి కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే ఫలితాలను వెల్లడిస్తూ వచ్చారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే ఫలితాలు ఇచ్చారు ప్రవీణ్ పుల్లట. ఆ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
* గ్రీన్ జోన్లో 28 మంది
ప్రస్తుతం కూటమి( Alliance) పార్టీల ఎమ్మెల్యేలు 28 మంది సేఫ్ జోన్ లో ఉన్నారు. వీరంతా గ్రీన్ జోన్ లో ఉన్నట్లు సదరు సర్వే వెల్లడించింది. ఆరెంజ్ జోన్లో 97 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే వీరి పనితీరు పరవాలేదు అని వెల్లడయ్యింది. కానీ ఓ 50 మంది ఎమ్మెల్యేలు మాత్రం రెడ్ జోన్ లో ఉన్నట్లు ప్రవీణ్ పుల్లట తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా పూర్తి ఫలితాలు ఈరోజు వెల్లడించనున్నారు. ఈ లెక్కన గ్రీన్ లేదా ఆరెంజ్ జోన్ లో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు 125 మంది గా నిర్ధారించారు. 50 మంది ఎమ్మెల్యేలు మాత్రం రెడ్ జోన్ లో ఉన్నట్లు తేల్చారు. దీంతో తొలి ఏడాది 50 మంది ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు తేలింది. 125 మంది ఎమ్మెల్యేలు సేఫ్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అదే సమయంలో ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దల పనితీరుపై ప్రజల్లో సానుకూలత కనిపిస్తోంది.
* కూటమికి కొంత ఉపశమనం..
గత కొద్దిరోజులుగా ప్రాంతాలవారీగా ఫలితాలను ప్రకటిస్తూ వచ్చారు ప్రవీణ్ పుల్లట. కూటమి గ్రాఫ్ ప్రస్తావించకుండానే ఎమ్మెల్యేల పనితీరుపై తన సర్వేలో తేలిన అంశాలను వెల్లడిస్తూ వచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోందని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్త ఫలితాలు ప్రకటించేసరికి కూటమికి మిశ్రమ ఫలితాలు వచ్చినట్లు అయింది. 125 మంది ఇప్పటికీ సేఫ్ జోన్ లో ఉన్నట్లు స్పష్టమైంది. సంక్షేమ పథకాల అమలు ప్రారంభం కావడం.. అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరుగుతుండడంతో ఈ నాలుగేళ్లలో మరింత సంతృప్తి స్థాయి పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు ఆశిస్తున్నాయి. అయితే తాజా సర్వే ఫలితాల్లో కూటమి ఎమ్మెల్యేలపై ఏకపక్షంగా వ్యతిరేకత ఉందని చెప్పడం లేదు. ఇది కూటమికి ఉపశమనం కలిగించే విషయమే.
Also Read: చంద్రబాబుపై ఆ సామాజిక వర్గం తిరుగుబాటు.. జగన్ ప్లాన్ అదే
కూటమి ఏడాది పాలన సందర్భంగా.. రైజ్ రాష్ట్రవ్యాప్త సర్వే!
గ్రీన్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేలు – 28 మంది
ఆరెంజ్ జోన్ లో – 97 మంది
రెడ్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేలు – 50 మంది
వివరాలు రేపు— Praveen Pullata (@praveenpullata) June 18, 2025