Amaravati Capital: అమరావతి రాజధాని( Amaravathi capital ) నిర్మాణం మరో సరికొత్త ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సిద్ధపడిన సంగతి తెలిసిందే. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. అన్ని వర్గాలు దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. తమ మద్దతును తెలియజేశాయి కూడా. అప్పటి టిడిపి ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనులను సైతం మొదలుపెట్టింది. ఇంతలో వైసీపీ అధికారంలోకి రావడం, మూడు రాజధానుల అంశం తెరపైకి రావడంతో అమరావతి రాజధాని నిర్మాణం నిలిచిపోయింది. గత ఐదేళ్లపాటు అమరావతికి ఆ నిర్ణయం శాపంగా మారింది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి కొత్త కళ వచ్చింది. పనులు పున ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వచ్చే నెల నుంచి చురుగ్గా పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు సరికొత్త రికార్డు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
* స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రైతులు
వాస్తవానికి అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ ప్రాంతం.. వరద ప్రభావిత ప్రదేశాల్లో ఉందన్నది ఒక అభ్యంతరం. అయితే గతంలో అన్ని రాజకీయ పక్షాలు అమరావతి రాజధాని కి జై కొట్టాయి. అయితే ఈసారి మాత్రం వైసిపి ఇది వరద ప్రాంతమని అనధికారికంగా చెప్పుకొచ్చింది. అయితే వైసిపి రాజకీయ ప్రయోజనాల కోసం ఆ ఆరోపణలు చేసి ఉంటుంది. కానీ అందులో వాస్తవం కూడా ఉంది. ఈ ప్రాంతమంతా పచ్చటి పొలాలతో ఉండేది. రెండు పంటలతో సాగు కూడా అధికంగా సాగేది. నిత్యం నీటి పరివాహక ప్రాంతంగా అమరావతి ఉండేది. అటువంటి చోట రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం. అయితే అమరావతి ప్రాంతంలో నీటి ప్రవాహం అధికంగా ఉంటుందని.. భారీ వర్షాల సమయంలో నగరం విపత్తుల్లో చిక్కుకోవడం ఖాయం అన్న కామెంట్స్ ఉన్నాయి.
* విమర్శలకు అవకాశం ఇవ్వకుండా
అయితే అమరావతి( Amaravathi ) విషయంలో ఏ చిన్న విమర్శకు కూడా అవకాశం ఇవ్వకూడదని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అమరావతి ప్రాంతంలో వరదలు, వరద మీరు చుట్టుముడితే.. ఇక్కడ నుంచి నీటిని రిజర్వాయర్లలోకి ప్రవేశించేందుకు భారీగా నాలుగు కాలువలను తవుతున్నారు. ఈ నీటిని తరలించే వీలుగా నాలుగు రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. రెండు ఎత్తిపోతల పథకాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఒక రాజధాని నిర్మాణానికి సాగునీటి వనరులను సిద్ధం చేస్తుండడం నిజంగా రికార్డ్. ఎక్కడైనా అనువైన ప్రాంతంలో రాజధాని కడతారు. కానీ రాజధాని నిర్మాణం కోసమే ఎత్తిపోతల పథకాలతో పాటు రిజర్వాయర్లు నిర్మించడం చిన్న విషయం కాదు. ఇది ముమ్మాటికీ రికార్డ్ బ్రేక్. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు అభినందించాల్సిందే.
* ఏకంగా కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం
అమరావతి రాజధాని ప్రాంతంలో కొండవీడు( kondaveedu ) వాగు, పాల వాగు ప్రవహిస్తుంటుంది. దాదాపు అన్ని గ్రామాలు భారీ వర్షాల సమయంలో ముంపులోనే ఉంటాయి. ఆ గ్రామాల నుంచి నీటిని తరలించేందుకు కాలువలను నిర్మిస్తున్నారు. ఈ నీరును రిజర్వ్ చేసేందుకు రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. కొండవీడు వాగు ఎత్తిపోతల పథకం పక్కనే మరో.. ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. అంటే రాజధాని నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలతో.. ఇలా అదనపు నిర్మాణాలు చేపడుతుండడం మాత్రం నిజంగా హర్షించదగ్గ పరిణామం.