Annadata Sukhibhava: ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం( Alliance government ). ఇప్పటికే తల్లికి వందనం పథకం నిధులను జమ చేసింది. ఇప్పుడు మరో పథకం పై కీలక అప్డేట్ వచ్చింది. అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ 3 విడతల నగదుతో.. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా అన్నదాత సుఖీభవ నిధులను 14 వేల రూపాయలను జమ చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 20న రైతుల ఖాతాలో నిధుల జమకు నిర్ణయించింది. అయితే కేంద్రానికి సంబంధించి పి ఎం కిసాన్ నిధుల విడుదల వాయిదా పడింది. ఈనెల 30న కేంద్రం నిధులు జమ చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే రోజు అన్నదాత సుఖీభవ నిధులు ఐదువేలు జత చేసి.. కేంద్రం అందించే రెండువేల తో పాటు ఇచ్చేందుకు అవకాశం ఉంది. దీనిపై కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
Also Read: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడం పై అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ!
* ఆ హామీ మేరకు
అధికారంలోకి వస్తే రైతులకు సాగు ప్రోత్సాహం కింద 20వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు( CM Chandrababu ) హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2019 నుంచి 2024 మధ్య రైతు భరోసా పేరిట జగన్ సర్కార్ సైతం సాయం అందించింది. అయితే కేంద్రం అందించే రూ.6000 తో పాటు మరో రూ.7500 జత కలిపి రూ. 13500 లను అందించారు. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కార్ మాత్రం 14 వేల రూపాయలు అందించనుంది. కేంద్రం అందించే 6000 రూపాయలతో కలిపి మొత్తం 20 వేల రూపాయలను రైతులకు అందించేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 30న పీఎం కిసాన్ తొలి విడత నిధులు జమ కానున్నట్లు తెలుస్తోంది. అదే రోజు అన్నదాత సుఖీభవ నిధులు కూడా జమ కానున్నాయి. మిగతా రెండు విడతల్లో పెండింగ్ మొత్తం అందించనున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక నిర్ణయం రావాల్సి ఉంది. ఇప్పటికే పథకానికి అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది.
* అన్ని జిల్లాల నుంచి సమాచారం..
అన్ని జిల్లాల నుంచి సమాచారం సేకరించే పనిలో ఉంది ప్రభుత్వం. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) పథకానికి 45,64,005 మంది రైతులు అర్హత సాధించారు. ఓ లక్ష ఇరవై వేల మంది మాత్రం ఇంకా ఈ కేవైసీ చేయాల్సి ఉంది. మరోవైపు రైతులు ఈ కేవైసీ చేయాల్సిన అవసరం లేదని.. అందరికీ నిధులు జమవుతాయని ప్రభుత్వం చెబుతోంది. గత ఏడాది జనవరిలో 53.58 లక్షల మంది రైతుల ఖాతాలో పిఎం కిసాన్ నిధులు జమాయ్యాయి. అప్పటితో పోలిస్తే మాత్రం ఓ ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులు తగ్గారు. అయితే దీనికి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో చేపట్టిన భూ సమగ్ర సర్వే సందర్భంగా వివరాలు తప్పుగా పొందుపరిచారు. అటువంటి రైతులకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
* స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా..
ఇప్పటికే సచివాలయాల్లో అర్హులైన రైతుల జాబితాను ప్రదర్శించారు. దీంతో అనర్హులు తమకు ఏ కారణంతో పథకం వర్తించడం లేదు తెలుసుకొని సరి చేసుకునే పనిలో పడ్డారు. వివరాలు లేని వారు బయోమెట్రిక్ నమోదు చేసుకుంటున్నారు. మరోవైపు స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది ప్రభుత్వం. htttps://annadathasukhibhava.ap.gov.in/ లోకి వెళ్లి రైతులు తమ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. రైతులు తమ ఆధార్ నెంబర్ నమోదు చేసి.. పక్కన ఉండే కాప్చా ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అర్హుల వివరాలు కనిపిస్తాయి. ఈ కేవైసీ అవసరం కూడా తెలియజేస్తుంది.
Also Read: ఏపీ గ్రౌండ్ రియాలిటీ.. ఎంపీ,ఎమ్మెల్యేలు, మంత్రులపై సంచలన సర్వే!