AP Assembly Election Results 2024: ఏపీలో సంచలనం.. ఎమ్మెల్యేగా అంగన్వాడీ టీచర్

వైసిపి ఆవిర్భావం నుంచి రంపచోడవరం లో ఆ పార్టీ విజయం సాధిస్తూ వస్తోంది. అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీకే ఆ నియోజకవర్గం మొగ్గుచూపింది. దీంతో ఈ నియోజకవర్గం టిడిపికి అందని ద్రాక్షగా ఉండేది.

Written By: Dharma, Updated On : June 5, 2024 10:28 am

AP Assembly Election Results 2024

Follow us on

AP Assembly Election Results 2024:  ఆమెకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రాతినిధ్యం లేదు. ఆర్థికంగా పేరున్న కుటుంబం కాదు. అలాగని వెనుక ఆస్తిపాస్తులు లేవు. అయినా సరే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. విస్తృత ప్రచారం చేశారు. ప్రజలు ఆశీర్వదించడంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? మిరియాల శిరీషా దేవి. ఎక్కడి నుంచి గెలిచారో తెలుసా?రంపచోడవరం నియోజకవర్గం నుంచి. అంగన్వాడీ టీచర్ గా ఉన్న శిరీషా దేవి ఏకంగా ఎమ్మెల్యే అయిపోయారు. ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే హాట్ టాపిక్. సుదీర్ఘ విరామం తర్వాత రంపచోడవరంలో టిడిపి జెండా ఎగురువేసింది కూడా ఆమె.

ఈ ఎన్నికల్లో రంపచోడవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా నాగులపల్లి ధనలక్ష్మి పోటీ చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని జగన్ ముందుగానే ఖరారు చేశారు. కానీ టిడిపి నుంచి సరైన అభ్యర్థి లేరు. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీ కార్మిక సంఘంలో చురుకైన పాత్ర పోషించిన శిరీషా దేవి కనిపించారు. టిడిపి నాయకత్వం ఆమెను రంగంలోకి దించింది. అభ్యర్థిగా ప్రకటించింది. నియోజకవర్గ వ్యాప్తంగా మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో పని చేయడంతో శిరీష దేవి విజయం సాధించింది. నాగులపల్లి ధనలక్ష్మి పై ఏకంగా 9,139 ఓట్లతో శిరీష దేవి విజయం సాధించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు సాధించారు శిరీషా దేవి. ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

వైసిపి ఆవిర్భావం నుంచి రంపచోడవరం లో ఆ పార్టీ విజయం సాధిస్తూ వస్తోంది. అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీకే ఆ నియోజకవర్గం మొగ్గుచూపింది. దీంతో ఈ నియోజకవర్గం టిడిపికి అందని ద్రాక్షగా ఉండేది. అందుకే చంద్రబాబు పక్కాగా స్కెచ్ వేశారు. అంగన్వాడీ టీచర్ గా పని చేస్తున్న శిరీషా దేవిని తెరపైకి తెచ్చారు.అయితే నాగులపల్లి ధనలక్ష్మి విజయం ఖాయమని వైసీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. కానీ అనూహ్యంగా శిరీషా దేవి విజయం సాధించారు. గత కొద్ది సంవత్సరాలుగా విజయం కోసం పరితపించిన టిడిపి శ్రేణులకు ఇది అనుకోని వరంగా కలిసి వచ్చింది.