Kalki 2898 AD: కల్కి సినిమాలో ప్రభాస్ లుక్స్ ఆటిట్యూడ్ ఎలా ఉన్నాయంటే..?

ఇప్పటికే బుజ్జి అండ్ భైరవ లకు సంబంధించిన ఆనిమేటెడ్ వీడియోని ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు బుజ్జి భైరవల మధ్య కామెడీ సీన్స్ సినిమాలో ఉండబోతున్నాయనే ఒక నిర్ణయానికైతే వచ్చారు.

Written By: Gopi, Updated On : June 5, 2024 10:21 am

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమా ఈనెల 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఈనెల రెండో వారంలో నిర్వహించబోతున్నట్టుగా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇక దానికి తగ్గట్టుగానే ఆయన అభిమానులు కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక ఇంతకుముందు వచ్చిన ‘సలార్ ‘ సినిమా ఎలాంటి సక్సెస్ అయితే సాధించిందో అంతకుమించి ఈ సినిమా సూపర్ హిట్ సాధించాలని వాళ్ళు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఇక ఇప్పటికే బుజ్జి అండ్ భైరవ లకు సంబంధించిన ఆనిమేటెడ్ వీడియోని ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు బుజ్జి భైరవల మధ్య కామెడీ సీన్స్ సినిమాలో ఉండబోతున్నాయనే ఒక నిర్ణయానికైతే వచ్చారు.

అయితే ఆ వీడియో లో ప్రభాస్ పాత్రను చూస్తున్న ప్రతి ఒక్కరు ఇంతకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బుజ్జిగాడు ‘ సినిమా టైమ్ లో ప్రభాస్ ఎలాంటి ఆటిట్యూడ్ తో అయితే నటించాడో అలాంటి ఒక వింటేజ్ ప్రభాస్ మనకు కనిపించబోతున్నారు అంటూ చాలామంది ప్రభాస్ అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది.

ఇంకా కల్కి సినిమాలో కూడా కొన్ని సీన్లలో అలాంటి టైమింగ్ రిపీట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాంటి కామెడీ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది మరి దీంట్లో బుజ్జి తో కలిసి చేయబోతున్న కామెడీ ఎంతవరకు ప్రేక్షకుల్ని అలరిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…