Good News for AP Ration Rice : ప్రభుత్వం రేషన్ బియ్యం బదులుగా రేషన్ కార్డు లబ్ధిదారులకు నగదు లేదా వాటి స్థానంలో ఇతర ధాన్యాలు కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం గత పాలనలో ఉన్న వైసిపి ప్రభుత్వం తీసుకుని వచ్చిన పలు విధానాలకు స్వస్తి పలికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం వినూత్నమైన ఆలోచనలను చేస్తూ సరికొత్త విధానాలతో ముందుకు వెళుతుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రేషన్ పంపిన విధానంలో కూడా సరికొత్త మార్పులను చేపట్టింది. రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీ విధానంలో కొన్ని కీలకమైన మార్పులను చేపట్టింది. కొంతమంది రేషన్ కార్డు ద్వారా తమకు అందే బియ్యాన్ని చాలా తక్కువ ధరకు వేరే వారికి అమ్ముతున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఇకపై రేషన్ బియ్యం తీసుకోవడానికి ఇష్టపడని లబ్ధిదారులందరికీ ఆ బియ్యానికి ప్రత్యామ్నాయంగా నగదు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు.
ఆదివారం రోజు కృష్ణాజిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో రాజపేట గ్రామంలో ఓ చౌక ధరల దుకాణాన్ని సందర్శించి మంత్రి కొల్లు రవీంద్ర రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర పాలనలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రేషన్ వ్యవస్థ పూర్తిగా చెరిగిపోయినట్లు మండిపడ్డారు. పేద ప్రజల కోసం రేషన్ ద్వారా అందిస్తున్న బియ్యం మాఫియా చేతిలో పడిపోయింది. ఇంటింటికి రేషన్ సరుకులు పేరుతో రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరిని సమస్యల లోకి నెట్టేశారు. ఆ సమయంలో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది అంటూ ఆయన విమర్శించారు.
Also Read : ఏపీలో జూన్ 1 నుంచి రేషన్ సరుకుల పంపిణీలో కొత్త మార్పులు అమలు..
ఈ నేపథ్యంలో పాలనలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం మళ్లీ చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ పున ప్రారంభించిందని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన కొత్త విధానం లో ప్రతినెల ఇకపై ఒకటవ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు అందుబాటులో ఉంటాయి. ఇది ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అని మంత్రి తెలిపారు. నెలలో ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినా కూడా వాళ్లకు 15 రోజుల గడువు ఉంటుంది. గతంలో రేషన్ తేదీలపై స్పష్టత లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఉండవు అంటూ మంత్రి వివరించారు.