Peacock Dancing: అబ్బ నెమలి స్వరం విన్నా, అది నాట్యం చేస్తున్నప్పుడు చూస్తున్నా సరే మనసుకు ఎంత హాయిగా అనిపిస్తుంది కదా. భలే ఆనందం, ఆసక్తిగా అనిపిస్తుంటుంది. అయితే ఈ నెమలికి గ్రంథాలలో దైవిక పక్షి హోదా ఇచ్చారు. ఎందుకంటే ఇది మహాదేవుడు, పార్వతీ దేవి కుమారుడు కార్తికేయ భగవానుడి వాహనం. అలాగే శ్రీకృష్ణుని కిరీటం మీద ఉంటుంది ఈ నెమలి ఈక. నెమలిని లక్ష్మీదేవికి సంబంధించినదిగా కూడా భావిస్తారు. అందుకే నెమలిని చూడటం అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తుంటారు. అయితే ఇది నాట్యం చేస్తున్నప్పుడు చూడవచ్చా? లేదా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. మరి అది క్లియర్ చేసుకుందామా?
సాధారణంగా నెమలిని చూడటం అంటే రాబోయే కాలంలో మీ దుఃఖాలు తొలగిపోతాయని లేదా మీ ఇంటికి డబ్బు వస్తుందని అర్థం. అంటే మీరు ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు ఒక నెమలి కనిపిస్తే, ఆ వ్యక్తి దురదృష్టం అదృష్టంగా మారుతుంది. ఈ కారణంగానే నెమలి ఈకలను ఉపయోగించి ఇంటిలోని వాస్తు దోషాలతో సహా వివిధ దోషాలను తొలగించడానికి చర్యలు తీసుకుంటారు కొందరు.
Read Also: బాహుబలి 2 సినిమాలోని స్టోరీని రాజమౌళి హనుమంతుడి స్టోరీ నుంచి తీసుకున్నాడా..?
నెమలి మనస్సు సాధారణంగా వర్షాకాలంలో మారుతుందట. రెక్కలు చాచి దాని నృత్యం వర్షాన్ని ఆహ్వానించడానికి, నెమలిని ఆకర్షించడానికి చేసే ప్రయత్నమని అంటారు కొందరు. ఇది భారతదేశ జాతీయ పక్షి మాత్రమే కాదు, ఎంతో మందికి నచ్చే ఇష్టమైన పక్షి. నెమలి మతపరమైన ప్రాముఖ్యతతో పాటు, శ్రీలంక, మయన్మార్‌లకు కూడా జాతీయ పక్షిగా ఉందట. భారతదేశంలో 26 జనవరి 1963న జాతీయం పక్షిగా గుర్తింపు పొందింది.
“పురాతన పౌరాణిక కాలాల గురించి మనం మాట్లాడుకుంటే, శ్రీకృష్ణుడు తన కిరీటంపై నెమలి ఈకలను ధరించేవాడు. అందుకే నెమలికి మతపరమైన, చారిత్రక ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు కాళిదాసు తన ఇతిహాసం ‘మేఘదూత్’లో నెమలిని జాతీయ పక్షి కంటే చాలా ఎక్కువగా వర్ణించాడు.” ఇంతకీ నెమలి నాట్యం చేస్తున్నప్పుడు చూడవచ్చా? లేదా అంటే నెమలి నాట్యం చేస్తుంటే చూడటం చాలా అందమైన అనుభూతిగా అనిపిస్తుంది. కానీ అన్ని సందర్భాలలో ఇది మంచిది కాదు అంటున్నారు నిపుణులు. కొందరు వాస్తు నిపుణులు దీన్ని ప్రతికూల సంకేతంగా చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం సమయంలో నెమలి నాట్యం చేయడం మీరు చూస్తే గనుక ఆ రోజున కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందట.
నెమలి నాట్యం చేయడం అనేది జీవితంలో ఏదైనా ముఖ్యమైన సంఘటన జరగబోతుందని హెచ్చరికగా కూడా చెబుతున్నారు కొందరు ఆధ్యాత్మిక పండితులు. ఎప్పటికప్పుడు ఎదురయ్యే మార్పులకు, పరిస్థితుల మార్పునకు సూచనగా ఉంటుంది ఈ నెమలి నాట్యం. ఒక వ్యక్తికి నిద్రలో నెమలి కనిపిస్తే కూడా మంచిది కాదని.. ఇలా జరిగితే అది ఒక రకమైన హెచ్చరికగా పరిగణించి జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలట.
Read Also: టాలీవుడ్ రివ్యూ : మే నెలలో ఏది హిట్ ? ఏది ఫట్.?
సంస్కృతిలో ఆధ్యాత్మికతకు, సహజ సౌందర్యానికి ప్రతీక ఈ నెమలి. అయితే దాని నాట్యం మనకు ఏ సంకేతాన్నిచ్చిందో అనేది సందర్భాన్ని బట్టి మారుతుంది కాబట్టి నెమలిని చూసిన వెంటనే భయపడకుండా జాగ్రత్త తీసుకోవడం ముఖ్యం. విశ్వాసం, ఆచారం, శాస్త్రం.. ఇవన్నీ కలిసి మన జీవితాన్ని సమతుల్యంగా నడిపిస్తాయి.
నెమలి ఎంతకాలం జీవిస్తుంది: నెమలి సగటు జీవితకాలం 15 సంవత్సరాలు. అది కీటకాలు, పాములను తింటుంది. నెమలి కన్నీళ్లు లేదా లాలాజలం వల్ల గర్భవతి అవుతుందనే అపోహ ఉంది. ఇదంతా ఒక పురాణం. నిజం ఏమిటంటే, ప్రతి ఇతర జీవిలాగే, నెమలి, మగ నెమలి కూడా జత కడతాయి. ఆ తర్వాత నెమలి గుడ్లు పెడుతుంది. ఆ గుడ్ల నుంచి పిల్లలు పుడతాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.