Bahubali 2 movie story : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళికి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన ఆయన త్రిబుల్ ఆర్ (RRR) సినిమాతో ఆస్కార్ రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఇక ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సినిమాను చేసి భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టాలనే ప్రయత్నంలో రాజమౌళి అయితే ఉన్నాడు. ఇక ఈ సినిమా కోసం దాదాపు 1000 కోట్లకు పైన బడ్జెట్ ను కేటాయిస్తుండటం విశేషం…ఈ సినిమాతో తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో తనను తాను చాలా కొత్తగా పరిచయం చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇక హాలీవుడ్ దిగ్గజ దర్శకుల పక్కన తన పేరు నిలుపుకోవాలంటే మాత్రం ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. రాజమౌళి చేసే సినిమాల విషయంలో కొన్ని సీన్లు కాపీ కొట్టాడు అంటూ అతని మీద కాపీ క్యాట్ అంటూ కొన్ని వార్తలైతే వస్తూ ఉంటాయి. నిజానికి ఆయన తీసిన సినిమాల్లోని కొన్ని షాట్స్ గాని, సీన్స్ గాని హాలీవుడ్ సినిమా నుంచి గాని ఇతర భాషల సినిమాల నుంచి గాని కాపీ చేసినట్టుగా యూట్యూబ్లో కొన్ని వీడియోలు అయితే షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా బాహుబలి (Bahubali) సినిమాలో ప్రభాస్ ధర్మం కోసం తన తల్లి మాటను సైతం ఎదిరించినా సీన్స్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తూ ఉంటాయి. అయితే ఈ సీన్స్ ని పురాణాల్లో అమ్మ మాటకు కట్టుబడిన ఆంజనేయుడు రాముడితో యుద్ధం చేస్తాడు. ఈ సీన్లనే బాహుబలి సినిమాలో పెట్టాడు అంటూ కొన్ని వార్తలు అయితే బయటికి వస్తున్నాయి. నిజానికి రామ ఆంజనేయ యుద్ధం అనేది ఎందుకు జరిగింది అంటే యేయతి అనే ఒక రాజు తనకి తెలియకుండా ఒక ఋషిని చంపుతాడు దానికి రాముడు అతన్ని చంపాలని చూస్తాడు.
Also Read : బాహుబలి 2 రికార్డ్ ను ఇప్పటివరకు ఏ సినిమా బ్రేక్ చేయకపోవడానికి గల కారణం ఏంటంటే..?
ఈ క్రమంలో ఆయన రాముడి నుంచి తప్పించుకొని తిరుగుతున్న సందర్భంలో ఆంజనేయుడు యొక్క తల్లి అంజనీ దేవి కంటబడతాడు అతను ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకున్న ఆవిడ నీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా నాకు చెప్పు నా కొడుకు నీ ఇబ్బందులు మొత్తాన్ని తీరుస్తాడు అంటూ అతనికి మాటిస్తుంది. దాంతో అతను రాముడు తో ఇలా వైరం ఉన్నట్టుగా చెబుతాడు.
మొత్తానికైతే ఆంజనేయుడు సైతం తన తల్లికి ఇచ్చిన మాట కోసం రాముడితో యుద్ధం చేయడానికి పూనుకుంటాడు. ఇక ఇదే సిచువేషన్ ని బాహుబలి లో కూడా రీ క్రియేట్ చేశారు. కుంతల దేశపు రాణి అయినా అనుష్కను మహిష్మతి రాజ్యంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకుంటానని మాట ఇచ్చిన ప్రభాస్ ధర్మం వైపు నిలబడటం కోసం తన తల్లి మాటను సైతం ఎదిరిస్తాడు.
ఇక బాహుబలి లో కూడా ధర్మ కోసం హనుమంతుడు తను ఆరాధించే రాముడిని ఎదురిస్తాడు… కాబట్టి పురాణాల్లో నుంచి ఈ సీన్ ని కాపీ చేశారు అంటూ కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. అక్కడ తల్లికి ఇచ్చిన మాట కోసం ధర్మం కోసం ఆంజనేయుడు రాముడు తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక్కడ ప్రభాస్ కూడా తన తల్లికి ఇచ్చిన మాట కోసం సినిమా నడుస్తుంది…