New Ration Rules in AP : జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారానే రేషన్ కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయబడతాయి. అలాగే వృద్ధులకు మరియు దివ్యాంగులకు సరుకులు డోర్ డెలివరీ చేయబడతాయి. జూన్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండియు వాహనాలు రద్దు చేయబడతాయని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులందరకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన తెలిపింది. రేషన్ సరఫరా విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి భారీగా మార్పులు చేపట్టబోతున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారానే రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులు మరియు దివ్యాంగులకు మాత్రం రేషన్ సరుకులను డోర్ డెలివరీ ద్వారా కొనసాగిస్తారు. మిగిలిన రేషన్ కార్డు లబ్ధిదారులకు తమ ఆధారిత రేషన్ షాపుల ద్వారానే సరుకులను అందిస్తారు.
Also Read : సూపర్ స్టార్ కుటుంబంపై జగన్ ఫోకస్
ఈ విధంగా చేయడం వలన సరుకు పంపిణీ చేయడంలో పారదర్శకత పెరుగుతుందని అలాగే వీటిలో ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా ఉంటుందని మంత్రి స్పష్టంగా తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన పౌరసరఫరాల శాఖ మంత్రి గతంలో ఎండియు వాహనాల ద్వారా సరుకులు సరఫరా చేయడం వంటి విధానం వలన అనేక అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. ఎండియు వాహనాల ద్వారా సరుకులు పంపిణీ చేయడంలో బియ్యం అక్రమ రవాణా అలాగే సరుకుల మళ్లింపు వంటి సమస్యలు తలెత్తినందుకు ఈ కొత్త మార్పులు తీసుకొచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎం డి యు వాహనాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి ఎండియు వాహనాలను కొనుగోలు చేసిన వారికి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వాహనాలు కొనుగోలు చేయడానికి వాళ్లు చెల్లించిన ధరలో పది శాతం మొత్తాన్ని వదిలేసి మిగిలినవి ప్రభుత్వ కార్పోరేషన్ ద్వారా ఆ వాహనాలకు చెల్లించి వాటిని ప్రభుత్వ కార్పోరేషన్కు అప్పగించనున్నట్లు తెలిపారు. ఎం డి యు వాహనాలను కొనుగోలు చేసిన యజమానులకు మంత్రి ప్రత్యేక భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు మరింత సౌకర్యం కలిగించే విధంగా రేషన్ షాపులు ఆదివారాలలో కూడా పనిచేస్తాయి అని మంత్రి స్పష్టంగా తెలిపారు. ప్రతినెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ షాపులలో కూడా రేషన్ కార్డుదారులకు రేషన్ సరుకులు పంపిణీ జరుగుతుంది అని తెలిపారు.