https://oktelugu.com/

Andhra Pradesh : డి లిమిటేషన్ తో ఏపీలో పెరిగే నియోజకవర్గాలు ఎన్నో తెలుసా?

Andhra Pradesh: 2014లో రాష్ట్ర విభజన ( state divide) జరిగింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది. అయితే నియోజకవర్గాల పునర్విభజనతో ఏడు పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయని.. 50 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని అంతా అంచనా వేశారు. కానీ ప్రస్తుతం దీనికి భిన్నంగా ఉంది పరిస్థితి.

Written By: , Updated On : March 22, 2025 / 12:27 PM IST
Increase constituencies with delimitation

Increase constituencies with delimitation

Follow us on

Andhra Pradesh : ఏపీలో( Andhra Pradesh) నియోజకవర్గాలు పెరుగుతాయా? పెరిగితే ఎన్ని పెరుగుతాయి? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. 2026 లో నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధపడుతోంది కేంద్ర ప్రభుత్వం. అయితే డి లిమిటేషన్ ప్రక్రియతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని తేలడంతో దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ లెక్కన నియోజకవర్గాల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఏపీలో మూడు పార్లమెంట్ స్థానాలు మాత్రమే పెరుగుతాయని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇది రాజకీయంగా రాష్ట్రానికి ఇబ్బందికరమే.

Also Read : జనసేనకు కౌంటర్.. వర్మ షాకింగ్ ట్వీట్!

* రాజకీయంగా నష్టం..
2014లో రాష్ట్ర విభజన ( state divide) జరిగింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది. అయితే నియోజకవర్గాల పునర్విభజనతో ఏడు పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయని.. 50 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని అంతా అంచనా వేశారు. కానీ ప్రస్తుతం దీనికి భిన్నంగా ఉంది పరిస్థితి. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 129 పార్లమెంట్ స్థానాలకు గాను.. ఓ పది పార్లమెంట్ స్థానాలు మాత్రమే పెరుగుతాయని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అలా అయితే రాజకీయంగా రాష్ట్రం ఎంతో నష్టపోవడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

* పెరిగేవి తక్కువే..
ప్రతి పార్లమెంటు స్థానం( Parliament seat ) పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. తొలుత నియోజకవర్గాల పునర్విభజనతో ఏడు పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయని అంతా భావించారు. ఈ లెక్కన 50 అసెంబ్లీ సీట్లు పెరగాలి. కానీ ఇప్పుడు జనాభా ప్రాతిపదికన పరిగణలోకి తీసుకోవడంతో కేవలం ఏపీలో 20 అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే రాజకీయ పార్టీల్లో ఉన్న ఆశావహులు ఆశలు నీరుగారినట్టే. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరిస్తే మాత్రం రాజకీయంగా ఏపీకి అన్యాయం జరగక తప్పదు.

* నేతల ఆశలపై నీళ్లు
2029 ఎన్నికల నాటికి ఏపీలో భారీగా నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని అంతా భావించారు. అన్ని పార్టీల్లో ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే అలా లేదు. కేవలం 20 అసెంబ్లీ సీట్లు.. మూడు పార్లమెంట్ సీట్లు పెరిగితే అవకాశాలు తగ్గుముఖం పడతాయి. చాలామంది నేతలు నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని.. తమకు అనుకూలమైన సీటు ఏర్పడుతుందని అంతా భావిస్తున్నారు. కానీ కేంద్రం వారి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది.