Deputy CM Pawan KalyanDeputy : తమిళనాడు డిప్యూటీ సీఎం స్టాలిన్ కి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే రేంజ్ కౌంటర్!

తమిళనాడు కి ఇటీవలే ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన స్టాలిన్ కి కూడా పవన్ కళ్యాణ్ ఘాటుగా రెస్పాన్స్ ఇచ్చాడు. గతం లో స్టాలిన్ మాట్లాడుతూ 'సనాతన ధర్మం అనేది ఒక వైరస్..దీనిని నిర్మూలం చేస్తాం' అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఇస్తూ 'ఈమధ్యనే ఒక తమిళ యువ నాయకుడు సనాతన ధర్మం వైరస్ అంటూ కామెంట్స్ చేసాడు.

Written By: Vicky, Updated On : October 3, 2024 9:49 pm

Deputy CM Pawan Kalyan

Follow us on

Deputy CM Pawan KalyanDeputy :  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు తిరుపతి లో నిర్వహించిన సభ దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయాలను ఒక కుదుపు కుదిపేసింది. సనాతన ధర్మం ని అవహేళన చేస్తూ మాట్లాడిన వాళ్లకు, హిందూ మతానికి సంబంధించి ఏదైనా దాడులు జరిగినప్పుడు, ఎక్కడైనా అపచారం జరిగినప్పుడు మాట్లాడే వాళ్ళను మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని మాట్లాడే వాళ్ళను ఏకిపారేసాడు. ఇదే ముస్లిమ్స్ మీద, క్రిస్టియన్స్ మీద దాడి జరిగితే మతాలను అడ్డు పెట్టుకొని మాట్లాడే మీరు, హిందూ సంప్రదాయాలు మంటకలుస్తున్న సమయంలో గొంతు పైకి లేపి మాట్లాడితే మీకు సెక్యులరిజం గుర్తుకు వచ్చిందా?..సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా మీకు?, మన మతాన్ని పూజించడం, ఇతర మతాలను గౌరవించడం అంటూ పవన్ కళ్యాణ్ ఎంతో ఆకర్షణీయమైన ప్రసంగం తో అదరగొట్టేసాడు.

అలాగే తమిళనాడు కి ఇటీవలే ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన స్టాలిన్ కి కూడా పవన్ కళ్యాణ్ ఘాటుగా రెస్పాన్స్ ఇచ్చాడు. గతం లో స్టాలిన్ మాట్లాడుతూ ‘సనాతన ధర్మం అనేది ఒక వైరస్..దీనిని నిర్మూలం చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఇస్తూ ‘ఈమధ్యనే ఒక తమిళ యువ నాయకుడు సనాతన ధర్మం వైరస్ అంటూ కామెంట్స్ చేసాడు. దానిని సమూలంగా నిర్మూలిస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. అతనికి ఒకటే చెప్తున్నాం, సనాతన ధర్మం ని నువ్వు నిర్మూలించలేవు, అలాంటి ఆలోచనలు ఉంటే నువ్వే అడ్రస్ లేకుండా పోతావు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. అంతే కాదు అతనికి అర్థం అయ్యేందుకు ఇంగ్లీష్ భాషలో ఒకసారి, అలాగే తమిళ భాషలో కూడా మరోసారి మాట్లాడి క్లారిటీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలకు కాంగ్రెస్ పార్టీ అభిమానులు మినహా, మిగతా వాళ్ళందరి నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హిందువుల మనోభావాల గురించి పబ్లిక్ లో నిర్మొహమాటంగా మాట్లాడే వాడు ఇన్నాళ్లకు ఒకడు వచ్చాడని పవన్ కళ్యాణ్ అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం కోసం పోరాడాల్సి వస్తే ప్రాణాలను ఇవ్వడానికైనా నేను సిద్ధమని, రాజకీయ లబ్ది కోసం మతాన్ని వాడుకునే అవసరం తనకి లేదని, కుదిరితే నా ఉప ముఖ్యమంత్రి పదవి ని కూడా వదులుకోవడానికి సిద్ధం అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. మరోపక్క స్టాలిన్ ని విమర్శించినందుకు ఆ పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియా లో పెద్ద రచ్చ నే జరుగుంతుంది. మరో పక్క తిరుపతి లడ్డు వ్యవహారం లో సుప్రీమ్ కోర్ట్ తీర్పు కోసం టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. మరి కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు నిజమైనవా? , లేదా వైసీపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదా అనే దానిపై రేపు క్లారిటీ రానుంది.