Tirupati Varahi Sabha: తిరుపతి సభలో ‘ఓజీ’ నినాదాలు..ఫ్యాన్స్ పై మండిపడ్డ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

సనాతన ధర్మం ని అవహేళన చేసినప్పుడు, గొంతెత్తి మాట్లాడితే రాజకీయాలు చేస్తున్నావు అని కొందరు అంటున్నారు, అంటే హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నప్పుడు మాట్లాడితే మతాల మధ్య చిచ్చు పెట్టినట్టా అంటూ ఆయన వ్యాఖ్యానించాడు.

Written By: Dharma, Updated On : October 3, 2024 9:38 pm

Deputy CM Pawan Kalyan

Follow us on

Tirupati Varahi Sabha: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు తిరుపతి లో ఏర్పాటు చేసిన సభలో ‘వారాహి డిక్లరేషన్’ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మన మతాన్ని పూజించు, పర మతాలను గౌరవించు అనే నినాదం తో మొదలైన ఆయన ప్రసంగం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. సనాతన ధర్మం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనేక మంది ప్రముఖ నాయకులను ఆయన ఈ ప్రసంగం లో ఏకిపారేసాడు. ఈ సభకు వేలాది మంది అభిమానులు హాజరై విజయవంతం చేసారు. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతీ ఒక్కరికి ఈ ప్రసంగం చేరేలాగా ఆయన ఇంగ్లీష్, తమిళ భాషల్లో కూడా మాట్లాడాడు. అలాగే వైసీపీ పార్టీ నాయకుల మీద, మాజీ సీఎం జగన్ మీద కూడా అయన విరుచుకుపడ్డాడు. సనాతన ధర్మం ని అవహేళన చేసినప్పుడు, గొంతెత్తి మాట్లాడితే రాజకీయాలు చేస్తున్నావు అని కొందరు అంటున్నారు, అంటే హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నప్పుడు మాట్లాడితే మతాల మధ్య చిచ్చు పెట్టినట్టా అంటూ ఆయన వ్యాఖ్యానించాడు.

ఇలా మాట్లాడుతున్న సందర్భంలో కొంతమంది అభిమానులు ‘ఓజీ..ఓజీ’ అంటూ నినాదాలు చేసారు. దీనికి చిరాకు పడిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘నేను ఇప్పుడు రాజకీయ ప్రచారం కోసం రాలేదు..సినిమా ఫంక్షన్ కోసం రాలేదు. సనాతన ధర్మం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారితో గొడవ పడడానికి వచ్చాను. ఇది చాలా ముఖ్యమైన సభ, మీ ఉత్సాహాన్ని అణిచి పెట్టి శ్రద్దగా వినండి’ అంటూ చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ అభిమానులు వినకుండా నినాదాలు చేయడం తో ‘ముస్లిం సోదరులను చూసి నేర్చుకోండి..వాళ్ళు నమాజ్ పేరు ఎత్తితే ఎంత ముఖ్యమైన పనిని అయినా ఆపేస్తారు. హిందువులు వారిని చూసి నేర్చుకోండి’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో పెను దుమారం రేపింది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగాన్ని యూట్యూబ్ లక్ష మందికి పైగా లైవ్ చూసారు. కేవలం ఒక్క జనసేన పార్టీ ఛానల్ నుండే 27 వేల మంది లైవ్ చూడడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కి చెందిన ముఖ్య నాయకులను, ఇండియా అలయన్స్ లో ఉన్న పార్టీలను ఆయన ఏకిపారేసాడు, దీంతో సోషల్ మీడియా లో కాంగ్రెస్ అభిమానుల నుండి వ్యతిరేకతతో పాటు, బీజేపీ పార్టీ అభిమానుల నుండి ప్రశంసలు కూడా అందుతున్నాయి. నిజాలు నిర్మొహమాటం గా బహిరంగ సభల్లో మాట్లాడే ధైర్యం కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉందని, ఆయన అభిమానులు అయ్యినందుకు గర్వంగా ఉందని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇది ఇలా ఉండగా తిరుపతి లడ్డు విషయం లో సుప్రీమ్ కోర్టు తీర్పు రేపు మధ్యాహ్నం లోపు బయటకి రానుంది.