Andhra Pradesh
Andhra Pradesh : ఏపీ ( Andhra Pradesh) ప్రజలకు చల్లటి కబురు. ఎండల నుంచి రిలీఫ్ ఇస్తూ విపత్తుల నిర్వహణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. ఈరోజు రాయలసీమ జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. సత్య సాయి, చిత్తూరు జిల్లాలో వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. గురువారం సైతం పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా ఎండలు మండుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి వర్ష సూచన చేస్తూ వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది.
Also Read : ఏపీలో ఈశాన్య రాష్ట్రాల బస్సులు.. రూ.82.14 కోట్లకు టెండర్!
* ఆ ప్రాంతాల్లో వర్షాలు
రేపు రాయలసీమ( Rayala Seema) జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ చిన్నపాటి జల్లులు పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది. శుక్రవారం ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. కొన్నిచోట్ల అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని.. రైతులతో పాటు పశువుల పెంపకం దారులు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా చెట్లు, స్తంభాలు, టవర్ల సమీపంలో ఉండకూడదని సూచించింది.
* ఈనెల 5 వరకు వర్షాలు
ఈనెల 5వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రాంతాల్లో వర్షాలు( rainfall ) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక అంచనా వేసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా చెబుతోంది. కాగా వర్ష సూచనతో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. ప్రధానంగా శుక్రవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. దీనిపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మండే వ్యాసములు వర్ష సూచన రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
* తగ్గని వడగాలుల తీవ్రత
ఒకవైపు వర్ష సూచన చేస్తూనే.. మరోవైపు వడగాలుల సైతం వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈరోజు శ్రీకాకుళం( Srikakulam district) జిల్లాలో ఆరు మండలాలు, విజయనగరం జిల్లాలో ఐదు, పార్వతీపురం మన్యం జిల్లాలో 11, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐదు, కాకినాడ జిల్లాలో ఒకటి, తూర్పుగోదావరి జిల్లాలో రెండు మండలాల్లో కలిపి మొత్తం 30 మండలాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వాతావరణం కాస్త మారింది. రాష్ట్రవ్యాప్తంగా వేడిగాలులు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : ఆ 89 మండలాలకు హై అలెర్ట్.. ఏపీలో మండుతున్న ఎండలు!