Andhra Pradesh : సాధారణంగా ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh) వాహనాలయితే ఏపీ పేరుతో.. తెలంగాణ వాహనాలైతే టీజీ పేరుతో నంబర్ ప్లేట్లు ఉండాలి. కానీ కొన్ని ప్రైవేటు బస్సులకు, ట్రావెల్ వాహనాలకు ఏఆర్ అలియాస్ అరుణాచల్ ప్రదేశ్, ఎన్ ఎల్ అలియాస్ నాగాలాండ్తో కనిపిస్తున్నాయి. అయితే అక్కడ రిజిస్ట్రేషన్ ల పేరుతో ఇక్కడ బస్సులు ఎందుకు తిప్పుతున్నారు అన్నది ప్రశ్న. అయితే దీని వెనుక పెద్ద కథ ఉంది. పన్నుల నుంచి తప్పించుకునేందుకేనని తెలుస్తోంది. ఈ బస్సుల రాకపోకలతో ఏపీ ప్రభుత్వానికి భారీగా నష్టం జరుగుతోంది. గత కొద్ది కాలంగా ఈ దందా జరుగుతూ వస్తోంది.
Also Read : ఆస్తి పన్ను కట్టే వారికి గుడ్ న్యూస్.. వడ్డీ రాయితీ.. ఎంత అంటే?
* రాష్ట్ర ఖజానాకు నష్టం..
ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్( Arunachal Pradesh), నాగాలాండ్ లో పన్నులు తక్కువ. అందుకే ఇక్కడ ఎక్కువ పనులు చెల్లించే బదులు.. అతి తక్కువ పనులు ఉన్న ఆ రెండు రాష్ట్రాల్లో వాటి యాజమాన్యాలు బస్సులను రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నాయి. దీనివల్ల మన రాష్ట్ర ఖజానాకు యాత్ర 82 కోట్ల రూపాయల మేర గండిపడుతోంది. నిబంధనల ప్రకారం ఓ ట్రావెల్స్ బస్సు నడపాలంటే అది ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయ్యిందో.. ఆ రాష్ట్రానికి పన్ను చెల్లించాలి. అయితే కేంద్ర ప్రభుత్వం వన్ ఇండియా.. వన్ పర్మిట్ లో భాగంగా ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ కింద ఏడాదికి 90000 చెల్లిస్తే చాలు. దేశంలో ఎక్కడైనా బస్సులు నడిపేందుకు వీలు కల్పించారు. అయితే ఏపీలో ఓ సీటు/ దత్తుకు మూడు నెలలకు సంబంధించి నాలుగు వేలు చొప్పున పన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఓ బస్సు కు సగటున లక్ష్య 50 వేల రూపాయలు చొప్పున.. ఏడాదికి ఆరు లక్షల రూపాయలు చెల్లించాలి. ఈ మొత్తం ఎక్కువగా ఉందని తెలుసుకున్న బస్సుల యాజమాన్యాలు ఇలా ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లకు ఎంచుకున్నారు.
* అక్కడ పన్నులు తక్కువ
అరుణాచల్ ప్రదేశ్ తో పాటు నాగాలాండ్లో రవాణా శాఖ( transport department) పన్నులు తక్కువ. అరుణాచల్ ప్రదేశ్లో 30.. అంతకంటే ఎక్కువ సీట్లు ఉండే బస్సులకు ఏడాదికి రూ.40,000 మాత్రమే పన్ను వసూలు చేస్తారు. నాగాలాండ్ లో అయితే ఏడాదికి రూ.56,000 తీసుకుంటారు. ఏపీతో పోల్చుకుంటే ఆ రాష్ట్రాల్లో దాదాపు 5.5 లక్షల రూపాయల పన్నులు తక్కువగా ఉంటాయి. అందుకే మన రాష్ట్రంలో ట్రావెల్స్ బస్సులు ఈశాన్య రాష్ట్రాల బాట పడుతున్నాయి.
* ఏజెంట్ల ద్వారా మేనేజ్..
గత మూడేళ్లలో ఏపీలో రిజిస్ట్రేషన్( registration in AP) కలిగిన 1369 బస్సులకు ఎన్ఓసీలు జారీ అయ్యాయి. ఈ బస్సులను ఈశాన్య రాష్ట్రాలకు తీసుకెళ్లి తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా రిజిస్ట్రేషన్ మార్చడం వల్ల ఏపీ ప్రభుత్వానికి 82 కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రైవేటు బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి.. 8 ఏళ్లు దాటాక ఏడాదికి ఒకసారి రవాణా శాఖ వద్ద ఫిట్నెస్ పరీక్ష చేయించుకోవాలి. అయితే ఆ రెండు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న బస్సులు ఎప్పుడు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకున్న దాఖలాలు లేవు. అలా చేయించుకోవాలంటే 2500 కిలోమీటర్ల మేర వెళ్లి అక్కడ పరీక్షలు చేసుకోవాలి. అందుకే అక్కడ ఏజెంట్ల ద్వారా మేనేజ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read : రాష్ట్రం ఏర్పడ్డాక 11 ఏళ్లకు ఆంధ్రాలో సెటిల్ అవుతున్న బాబు