AP Assembly Election Results 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం టిడిపి 131 స్థానాల్లో లీడ్ లో ఉంది. రెండు స్థానాలలో విజయం సాధించింది. జనసేన 20, బీజేపీ 7 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక అధికార వైసిపి 15 స్థానాలలో ముందంజలో ఉంది. కూటమి అభ్యర్థుల దెబ్బకు ఏపీలో జిల్లాలకు జిల్లాలే క్లీన్ స్వీప్ అవుతున్నాయి.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 12 సెగ్మెంట్లలో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 స్థానాలకు గానూ 12 స్థానాలలో కూటమి అభ్యర్థులు విజయం దిశగా అడుగులు వేస్తున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 కి 19 స్థానాలలో లీడ్ లో కొనసాగుతున్నారు.
కృష్ణా జిల్లాలో 16 స్థానాలకు 15 స్థానాలలో పై చేయి సాధించారు.
కర్నూలు జిల్లాలో 14 స్థానాలకు 11 స్థానాలలో లీడ్ లో ఉన్నారు.
నెల్లూరులో పది స్థానాలకు 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు 10 నియోజకవర్గాలలో ముందంజలో ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాలకు 9 స్థానాలలో పై చేయి సాధించారు.
విశాఖపట్నం జిల్లాలో 15 స్థానాలకు 13 స్థానాలలో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
విజయనగరం జిల్లాలో 9 స్థానాలకు ఎనిమిది చోట్ల ముందంజలో ఉన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో 15 స్థానాలకు 14 చోట్ల లీడ్ లో కొనసాగుతున్నారు.
ఇక కూటమి అభ్యర్థుల దెబ్బకు పలువురు మంత్రులు ఓటమి బాట పట్టారు. మంత్రులలో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, పీడిక రాజన్న దొర, దాడిశెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ, చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడదల రజిని, మెరుగు నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఉషశ్రీ చరణ్ వంటివారు వెనుకబడి ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనూ కూటమి అభ్యర్థులు మెజారిటీ స్థానాలలో లీడ్ లో ఉన్నారు.