Lok Sabha Election Results 2024: దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మెజారిటీ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. 2024లో మాత్రం ఇక్కడి ఫలితాలు బీజేపీకి షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే… ఇండియా కూటమి ఆధిక్యత కనబరుస్తోంది. 2019లో 80 స్థానాలకు 62 స్థానాలు గెలిచింది. ఎన్డీ కూటమికి చెందిన అప్నాదల్ 2 స్థానాల్లో గెలిచింది. మాయావతి ఒంటరిగా పోటీ చేసి 10 స్థానాలు గెలిచింది. సమాజ్‌వాదీ పార్టీ 5, కాంగ్రెస్ ఒక్క సీటు గెలిచాయి.
ఇండియా కూటమిలో..
ఈసారి అప్నాదళ్‌తోపాటు జయంత్‌చౌదరి నేతృత్వంలో ఆర్‌ఎస్‌ఎల్ డీ, సులేహ్‌దేవ్, భారతీయ సమాజ్ పార్టీ ఎన్డీయే కూటమి పోటీ చేశాయి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ 52 స్థానాలకు, కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేశాయి. బీఎస్పీ ఒంటరిగా బరిలో నిలిచింది.
ప్రస్తుతం ఇలా..
ఇక తాజా ట్రెండ్స్ చూస్తుంటే 80 స్థానాలకు ఎన్‌డీయే కూటమి 38 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇండియా కూటమి 41 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. ఇతరులు ఒక స్థానంలో ఉన్నారు. బీఎస్సీ ఖాతా తెరవలేదు. గత ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ ఎన్డీఏ భారీగా స్థానాలు కోల్పోతోంది.