Homeఆంధ్రప్రదేశ్‌Ambati Rambabu Bail: అంబటి రాంబాబును ఏం చేస్తారు?!

Ambati Rambabu Bail: అంబటి రాంబాబును ఏం చేస్తారు?!

Ambati Rambabu Bail: మాజీ మంత్రి అంబటి రాంబాబు( ambati Rambabu) జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ రావడంతో రిలీజ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం కూలిపోయే వరకు తాను పోరాడుతానని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు సేవలను ఎలా వినియోగించుకుంటుంది అనేది చర్చ. సహజంగానే అంబటి రాంబాబుకు దూకుడు ఎక్కువ. ఆ దూకుడు తోనే సీఎం చంద్రబాబుపై నడిరోడ్డులో తిట్ల దండకం అందుకున్నారు. ఇప్పుడు జైలుకు వెళ్లి రావడంతో పశ్చాత్తాప […]

Ambati Rambabu Bail: మాజీ మంత్రి అంబటి రాంబాబు( ambati Rambabu) జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ రావడంతో రిలీజ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం కూలిపోయే వరకు తాను పోరాడుతానని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు సేవలను ఎలా వినియోగించుకుంటుంది అనేది చర్చ. సహజంగానే అంబటి రాంబాబుకు దూకుడు ఎక్కువ. ఆ దూకుడు తోనే సీఎం చంద్రబాబుపై నడిరోడ్డులో తిట్ల దండకం అందుకున్నారు. ఇప్పుడు జైలుకు వెళ్లి రావడంతో పశ్చాత్తాప పడతారా? లేకుంటే అంతకుమించి అన్నట్టు వ్యవహరిస్తారా? అన్నది తెలియాలి.

* అన్నింటికీ సిద్ధం..
కచ్చితంగా అంబటి రాంబాబును రాజకీయంగా వాడుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ. అందుకు ఆయన సైతం సిద్ధంగా ఉంటారు. కాపు నేతగా ఆయనను ప్రమోట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయంలో కొంత సక్సెస్ కనిపిస్తోంది కూడా. అయితే అంబటి రాంబాబును కాపు నేతగా చూపించడం వైసీపీని ఇష్టపడే కాపులకు ఇష్టపడవచ్చు కానీ.. తటస్థ కాపులను మాత్రం ఎంత మాత్రం ప్రభావం చూపలేదు. ఈ ప్రయత్నం మరింత వికటిస్తుందన్న అభిప్రాయం ఉంది. అంబటి రాంబాబు విషయంలో ప్రజలకు ఒక అభిప్రాయం ఉంది. పైగా ఆయన దూకుడు తనం శృతిమిస్తోందన్న టాక్ ఉంది. ఆయన జులుం ప్రదర్శించడం సైతం ఏపీ ప్రజలకు సుపరిచితం.

* ఎన్నెన్నో అభ్యంతరాలు..
మరోవైపు అంబటి రాంబాబును కాపు టైగర్ గా వర్ణించడానికి ఎక్కువమంది వైసీపీ కాపు నేతలు తప్పుపడుతున్నారు. పార్టీలో సీనియర్లు సైతం ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీపై దూకుడు ముద్ర ఉంది. కొంతమంది నేతలు బూతులు మాట్లాడతారని ప్రజల్లోకి వెళ్ళింది. 2024లో అందుకు మూల్యం కూడా చెల్లించుకున్నారు. ఇటువంటి సమయంలో అంబటి రాంబాబును ప్రయోగించడం అంటే వికటించే చర్య అవుతుందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం దిగిపోయే వరకు విశ్రమించనని అంబటి రాంబాబు చెబుతున్నారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ బాధ్యతలు అప్పగించిన చేస్తానని సంకేతాలు ఇచ్చారు. మరి ఎలాంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper