Amaravati Re Launch: అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడుకలు ముగిశాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ఆవిష్కరణలు జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం కనిపించింది. ప్రారంభోత్సవ వేడుకలకు వచ్చినవారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వెలగపూడి లో ఈ ప్రారంభోత్సవ వేడుక జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి తో పాటు ఏపీకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నో వింతలు విశేషాలకు వేదిక అయింది ఈ కార్యక్రమం. ముఖ్యంగా నారా లోకేష్, ప్రధాని మోడీ మధ్య సరదా సంభాషణ జరిగింది.
Also Read: వైసీపీకి ఆ ఇద్దరు నేతలు షాక్!
* అమరావతిని ఆపేదెవరు?
అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా తొలుత మంత్రి నారాయణ మాట్లాడారు. అనంతరం లోకేష్( Minister Lokesh) ప్రసంగించారు. అమరావతిని ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని.. వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని చూసిందని విమర్శించారు. పాకిస్తాన్పై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ సైతం కీలక ప్రసంగం చేశారు. పవన్ ప్రసంగానికి ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఫిదా అయ్యారు. ఆయనను అభిమానించక తప్పలేదు. పవన్ ప్రసంగం ముగిశాక తిరిగి తన కుర్చీపై కూర్చున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఆయనను పిలిచి చేతిలో చాక్లెట్ పెట్టి అభినందించారు. దీంతో అక్కడ నవ్వులు పూసాయి.
* సరదా సంభాషణ..
మరోవైపు సభ వేదిక ప్రాంగణంలో.. నారా లోకేష్ ప్రధాని మోదీని( Prime Minister Narendra Modi) నమస్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ లోకేష్ ను ఆప్యాయంగా పలకరించి.. భుజం తట్టారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నన్ను కలవడానికి రావా అని? ప్రధాని అనేసరికి వెంటనే స్పందించారు లోకేష్. త్వరలోనే కుటుంబ సమేతంగా ఢిల్లీకి వస్తాను అని ప్రధానితో అన్నారు. గత పర్యటనలో కూడా నారా లోకేష్ తో ప్రధాని మోదీ ఇదే అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా నారా లోకేష్ విషయంలో ప్రధాని అదే స్థాయిలో స్పందించడం విశేషం.
* బిజెపి పెద్దలతో సంబంధాలు..
నారా లోకేష్ కు ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలే ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నారా లోకేష్ ఢిల్లీలో పెద్దలను కలిశారు. వారితో చర్చలు జరిపారు. అటు తరువాతే చంద్రబాబుకు బెయిల్ లభించింది. అప్పుడే కేంద్ర పెద్దలతో లోకేష్ బంధం మరింత పెరిగింది అన్న టాక్ వినిపించింది. అయితే వారసత్వ రాజకీయాలకు మోడీ దూరం అని భావించి లోకేష్ సైతం ఆయనకు దూరంగానే ఉంటున్నారు. కానీ ఏపీ పర్యటనకు వచ్చే సమయంలో ప్రధాని మోదీ లోకేష్ ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఢిల్లీ వచ్చి కలవాలని సూచిస్తున్నారు.
Also Read: వైసీపీకి ఆ ఇద్దరు నేతలు షాక్!