spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Quantum Valley Project: అమరావతికి 'క్వాంటం' ఖ్యాతి.. ఈ కంప్యూటర్ల ప్రత్యేకత ఏంటంటే..

Amaravati Quantum Valley Project: అమరావతికి ‘క్వాంటం’ ఖ్యాతి.. ఈ కంప్యూటర్ల ప్రత్యేకత ఏంటంటే..

Amaravati Quantum Valley Project: అమరావతిలో ( Amravati capital ) నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచ క్వాంటం డే సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఒక సంచలనానికి తెర తీయనుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మేధా టవర్స్ లో రెండు వేరు వేరు క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అమరావతి కేంద్రంగా ఆవిష్కృతం అవుతున్న క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీతో టెక్నాలజీ విప్లవానికి సరికొత్త నాంది పలకనుంది ఏపీ ప్రభుత్వం. కంప్యూటర్ ఎన్నో రకాల రూపకల్పనలను మార్చుకుంటూ ఇప్పుడు క్వాంటం స్థాయికి చేరుకుంది. శతాబ్దాల కిందట పెద్ద గది పరిణామం లో ఉండేది కంప్యూటర్. ఇప్పుడు అరచేతిలో ఇమిడి పోయేటంత రూపాంతరం సాధించింది. ఇప్పుడు క్వాంటం కంప్యూటర్ విప్లవం మొదలైంది.

* ఎన్నో ప్రత్యేకతలు..
క్వాంటం కంప్యూటర్ కు ( Quantum computer)ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సూపర్ కంప్యూటర్ కంటే చాలా వేగంతో పని చేయగలదు ఇది. డేటా ప్రాసెసింగ్ లో చాలా వేగవంతంగా ఉంటాయి. మున్ముందు ఊహకు అందని సంచలనాలు సృష్టించనున్నాయి. అటువంటి కంప్యూటర్ల తయారీకి అమరావతి క్వాంటం వ్యాలీ వేదిక కావడం నిజంగా ఈ రాష్ట్రానికి గర్వకారణం.
* క్వాంటం కంప్యూటర్ల తయారీ అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. సూపర్ కండక్టింగ్ మెటీరియల్స్, చాలా తక్కువ ఉష్ణోగ్రత, క్రయోజనిక్ ఫ్రిజ్ దీనికి అత్యంత అవసరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రసాయనిక రంగం, వాతావరణ అధ్యయనం, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, సప్లై చైన్, లాజిస్టిక్ రంగాల్లో విప్పుల వాళ్ళు సృష్టించనుంది క్వాంటం కంప్యూటర్.
* ప్రస్తుతం కంప్యూటర్ల వాడకం అధికం. భవిష్యత్తులో సాధారణ కంప్యూటర్ల స్థానాన్ని క్వాంటం కంప్యూటర్లు భర్తీచేస్తాయి. ఇప్పుడు ఉన్న సూపర్ కంప్యూటర్లకు మించి వందల రెట్లలో ఇది వేగవంతంగా పనిచేస్తుంది.
* ఫార్మాస్యూటికల్స్, అంతరిక్ష, రక్షణ, ఆరోగ్య రంగాల్లో అనేక క్లిష్ట సమస్యలకు అత్యంత వేగంతో ఈ క్వాంటం కంప్యూటర్ పరిష్కార మార్గాలు సూచిస్తుంది.
* మెరుపు వేగం ఈ కంప్యూటర్ల సొంతం. సాధారణ కంప్యూటర్లు మనం చేయలేని క్లిష్టమైన సమస్యలకు ఇందులో సులభంగా పరిష్కార మార్గాలు కనుగొనవచ్చు. ఇంక్యుబేటర్లు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular