Demon Slayer – Kimetsu no Yaiba Infinity Castle Trailer Talk: ప్రస్తుతం ఆనిమేటెడ్ మూవీస్ కి ఇండియాలో ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన ‘మహావతార్ నరసింహ’ సినిమాతో ఇండియన్ ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పట్టారు. మంచి కాన్సెప్ట్ తో వస్తే యానిమేటెడ్ మూవీస్ సైతం చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా కంటెంట్ బాగుంటే బొమ్మలతో సినిమాలు చూపించిన సరే మేం చూడ్డానికి రెడీగా ఉన్నామంటూ ప్రేక్షకులు మహావతార్ నరసింహ సినిమాను హిట్ చేసి చూపించారు. మరి అలాంటి క్రమంలోనే క్రంచిరోల్ మరియు సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా చేస్తున్న డీమన్ స్లేయర్ కిమెట్స్ నో యైబా – ఇన్ఫినిటి క్యాసిల్ అనే మూవీ చేస్తున్నారు… ఇక దీనికి సంబంధించిన ట్రైలర్ ను గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు…ఇక క్రంచిరోల్ మరియు సోనీ పిక్చర్స్ ఎంటర్ టైన్ మెంట్ కలిసి నిర్మస్తున్న ఈ యానిమేటెడ్ చిత్రం ఇండియాలో సెప్టెంబర్ 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది…
ఇక ఈ ట్రైలర్ ను బట్టి ఈ సినిమా కథ ఏంటంటే… టాజీరో కమాడో అనే పిల్లాడి పేటెంట్ ను ఒక రాక్షసుడు చంపేస్తాడు…ఇక ఈ క్రమంలోనే తన చెల్లెలు నేజుకి రాక్షసి గా మారి బీభత్సం చేస్తోంది… తన చెల్లిని మామూలు మనిషిగా ఎలా మార్చాడు అనేదే ఈ సినిమా స్టోరీ…
Also Read: ‘ధూమ్ 4’ కోసం మరో క్రేజీ టాలీవుడ్ హీరోపై కన్నేసిన యాష్ రాజ్ సంస్థ..చివరికి ఏమైందంటే!
అయితే ఈ ట్రైలర్ లో స్టోరీని ఎలివేట్ చేస్తూనే ఇందులో రాక్షసులు దుష్ట శక్తులు వంటివి ఉన్నాయి అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశారు… దర్శకుడు హరుఓ సోటోజాకి ప్రతి ప్రాత ను చాలా చక్కగా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది…ఇక ఇందులో ఒక పెద్ద యుద్ధం కూడా జరగబోతోంది అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశాడు…అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ కి వాళ్ల క్యారెక్టరైజేషన్స్ కూడా క్రియేట్ చేశాడు…అందుకే ఇది చాలా స్పెషల్ గా కనిపిస్తుంది…
విజువల్స్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. అలాగే డైరెక్టర్ తన విజన్ తో కొన్ని షాట్స్ లో సైతం సినిమా కంటెంట్ ను చెప్పే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది…చివర్లో ఒక పిల్లాడి కంట్లో నుంచి ఒక అమ్మాయి ఓపెన్ అవుతుంది…దానికి అర్థం ఏంటంటే ఆ వ్యక్తిని ఇతను కంట్లో పెట్టుకొని కాపాడుతున్నాడు అనే అర్థం వచ్చేలా ఈ షాట్ ను అయితే డిజైన్ చేశారు…ఇక ఈ సినిమాను ఇండియాలో ఉన్న మల్టీ ఫ్లెక్స్ థియేటర్ లో రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ ను కొట్టాలని చూస్తున్నారు…మరి వాళ్ళు అనుకున్నది జరుగుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
