Homeఆంధ్రప్రదేశ్‌Amaravati capital : అమరావతి భూములు.. ఆ కులపోళ్లవే అధికం!

Amaravati capital : అమరావతి భూములు.. ఆ కులపోళ్లవే అధికం!

Amaravati capital : అమరావతి రాజధాని( Amaravathi capital ).. గత దశాబ్ద కాలంగా వినిపిస్తున్న మాట ఇది. 2014లో అందరి ఆమోదయోగ్యంతో అమరావతి రాజధానిని ఎంపిక చేసింది అప్పటి ప్రభుత్వం. పనులు కూడా ప్రారంభించింది. ఆ నిర్మాణాలు కొనసాగి ఉంటే ఒక ప్రజా రాజధాని ఇప్పటికే ఆవిష్కృతం అయ్యేది. రాజకీయ కారణాలతో అమరావతిపై విష ప్రచారం జరిగింది. పూర్తిగా నిర్వీర్యం అయ్యింది. దాదాపు కనుమరుగైపోయిందన్న తరుణంలో అమరావతి రైతుల ఉద్యమం ఊపిరి పోసింది. సరికొత్త ఊపిరిలూదింది. అమరావతికి అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది. మళ్లీ ఇప్పుడు సరికొత్త సందడి ప్రారంభమైంది. అమరావతి నవ శకం మొదలైంది.

* వైసిపి హయాంలో విషప్రచారం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. ఆ సమయంలో రకరకాల ప్రచారం నడిచింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూములు ఒక కులానికి చెందిన వని.. ఆ కుల ప్రయోజనాల కోసమే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం ప్రయోజనాల కోసమే చంద్రబాబు అమరావతి రాజధాని గా ఎంపిక చేసినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. కానీ ఇవేవీ పట్టించుకోలేదు ఏపీ ప్రజలు. అమరావతి అనేది 29 గ్రామాల ప్రజల సమస్యలు అని భావించలేదు. అది ఆంధ్రుల కల అని.. భవితకు వారధి అని భావించి.. అమరావతికి వ్యతిరేకంగా మారిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తీసారు ఏపీ ప్రజలు.

Also Read : మారిన ‘అమరావతి’ ఆహ్వాన పత్రిక.. ఆ ఇద్దరు నేతల సరసన పవన్!

* 32 శాతం ఎస్సీ, ఎస్టీలవే
అయితే నేడు అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ( Prime Minister Narendra Modi) శంకుస్థాపన చేయనున్నారు. అయితే అమరావతి రాజధాని ప్రాంతంలో ఏ కులాలవారు భూములు కోల్పోయారు అన్నది ఇప్పటికీ చర్చగానే ఉంది. ఇక్కడ భూ సమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన వారిలో 32 శాతం ఎస్సీలు, ఎస్టీలు ఉండడం విశేషం. ఇక బిసి వర్గానికి చెందిన వారు 14% ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం వారు 20 శాతం, కమ్మ వర్గం 18 శాతం, కాపులు తొమ్మిది శాతం ఉన్నారు. భూములు కోల్పోయిన వారిలో ముస్లింలు సైతం మూడు శాతం ఉండడం విశేషం.

* అన్ని కులాలు సంఘటితం
అయితే అమరావతికి భూములు ఇచ్చిన వారిలో ఎక్కువ శాతం ఎస్సీలు( scheduled caste ) ఉన్నారు. 2014 ఎన్నికల్లో అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ ఎస్సీలంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. దీనికి మంగళగిరి నియోజకవర్గం చక్కటి ఉదాహరణ. గుంటూరు ప్రాంతంలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి అదే ప్రధాన కారణం. 2019లో అయితే రాజధాని ప్రాంతంలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, రెడ్డి సామాజిక వర్గం, కాపుల్లో అధిక శాతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. అందుకే నారా లోకేష్ లాంటి వాళ్లు సైతం ఓడిపోయారు. అయితే 2024 ఎన్నికల నాటికి పూర్తిగా సీన్ మారింది. అమరావతి రాజధానికి వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. అమరావతి రైతుల ఉద్యమం పట్ల కర్కశం గా వ్యవహరించింది. దాని పర్యవసానాలు 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి. అమరావతి ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తుడుచుపెట్టుకుపోయింది. ఎక్కడైతే నారా లోకేష్ ఓడిపోయారో.. అదే నియోజకవర్గంలో 90 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అమరావతి అనేది అన్ని కులాల సమాహారం అని.. అన్ని కులాలు ముక్తకంఠంతో ఏకమై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణంగా దెబ్బతీసాయి. అమరావతిలో అన్ని కులాలు ఉన్నాయని చాటి చెప్పాయి.

Also Read : అమరావతి పునర్నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్.. అప్పటి నుంచే పనులు!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version