Amaravati Capital: అమరావతి రాజధాని( Amaravati capital ) నిర్మాణానికి సంబంధించి కీలక పరిణామం. పనుల ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం ముహూర్తం సిద్ధం చేసింది. ఈనెల 12 నుంచి 15 మధ్య రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఖచ్చితమైన ముహూర్తాన్ని ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. దీంతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా మూడు సంవత్సరాల్లో పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించింది. అన్ని విధాలా అమరావతి రాజధానిని అందుబాటులోకి తేవాలన్నది సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రణాళిక.
Also Read: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. హాల్ టికెట్ చూపిస్తే చాలు ఉచిత ప్రయాణం!
* కూటమి రావడంతో..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని విషయంలో కదలిక వచ్చింది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధాని ఎంపిక జరిగింది. అందరి ఆమోదంతో ఏకాభిప్రాయంతో అమరావతిని ఎంపిక చేశారు. రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. అమరావతి రాజధాని స్థానంలో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అయితే మూడు రాజధానుల నిర్మాణం పూర్తి చేయడంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయింది. ఇప్పుడు మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి రాజధానిని శరవేగంగా పూర్తి చేయాలని సంకల్పంగా పెట్టుకుంది.
* కేంద్ర ప్రభుత్వ సాయం..
కేంద్ర ప్రభుత్వం( central government) సైతం అమరావతి రాజధాని నిర్మాణానికి అన్ని విధాల సహకారం అందిస్తోంది. ఇప్పటికే 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. మరోవైపు వివిధ సంస్థల ద్వారా పెట్టుబడి సేకరణ కూడా జరిగింది. అమరావతి రాజధాని నిర్మాణానికి దాదాపు 40 వేల కోట్ల రూపాయలు సమీకరించింది కూటమి ప్రభుత్వం. మరోవైపు వివిధ సంస్థలు సైతం తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయి. ఒకవైపు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం.. ఇంకోవైపు ప్రైవేటు సంస్థల భవనాల నిర్మాణం కూడా ప్రారంభం కానుంది. గత అనుభవాల దృష్ట్యా 2028 నాటికి అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని బలమైన సంకల్పంతో ముందుకు అడుగు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
* 2029 ఎన్నికల నాటికి..
2029 ఎన్నికల నాటికి
2029 లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ సమయానికి రాజధాని( capital ) నిర్మాణం పూర్తి చేయాలన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యం. తద్వారా రాజధాని నిర్మాణం పూర్తి చేశామని.. తమను ఆశీర్వదించాలని ప్రజల వద్దకు వెళ్లేందుకు కూటమి ఆలోచనగా తెలుస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అమరావతి రాజధాని నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. తమ సొంత శాఖ కంటే రాజధాని నిర్మాణానికి ఆయన అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు.
Also Read: మెగా బ్రదర్ నాగబాబు ఆస్తులు ఎంతో తెలుసా? ఎన్ని కోట్లంటే?