Amaravati Capital: అమరావతి రాజధాని( Amaravathi capital ) పునర్నిర్మాణ పనుల ప్రారంభ సమయం ఆసన్నమైంది. రేపు ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 5 లక్షల మంది జనాలు వస్తారని అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది. ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రధాని పర్యటన కట్టుదిట్టమైన భద్రత నడుమ జరగనుంది. ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించారు సిఆర్డిఏ అధికారులు. అయితే ఆహ్వాన పత్రికపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడంపై జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు. దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.
Also Read: ఆ వైసీపీ మాజీ ఎంపీ రాజకీయ నిష్క్రమణ
* ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు..
కూటమి ( Alliance ) అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు అవుతోంది. ఈ పది నెలలపాటు అమరావతి రాజధాని నిధుల సమీకరణ జరిగింది. ఇది ఒక కొలిక్కి రావడంతో అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకే ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే భారీ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన పత్రికలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై జనసైనికులు ఆగ్రహంగా ఉండగా.. వైసిపి శ్రేణులు ప్రచార అస్త్రంగా మార్చుకుంటున్నాయి. సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వెలిశాయి. దీనిపై అప్రమత్తమైన సీఆర్డీఏ అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఆహ్వాన పత్రికలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును సైతం జత చేశారు.
* జనసైనికుల ఆగ్రహంతో..
గత కొద్ది రోజులుగా అమరావతి రైతులకు బొట్టు పెట్టి మరి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో( social media) ఆహ్వాన పత్రిక వైరల్ అయింది. అందులో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడంతో అభిమానులు మనస్థాపానికి గురయ్యారు. కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ కు గౌరవం ఇచ్చేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని జనసైనికులు డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కీలకమైన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. దీంతో ఇది వివాదంగా మారింది. మరోవైపు మాజీమంత్రి పేర్ని నాని సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్ట్ పెట్టారు. ఆహ్వాన పత్రిక ఫోటోను పెట్టి.. ఇక్కడ ఏదో ఒకటి మిస్సింగ్ అంటూ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది విపరీతంగా వైరల్ అయింది. అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రం అందిస్తున్నారని జనసైనికులు టిడిపి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
* ముగ్గురు పేరుతో ఆహ్వాన పత్రికలు..
ఇప్పటివరకు అందించిన ఆహ్వాన పత్రికలతో పాటు కొత్తగా మరికొన్ని ఆహ్వాన పత్రికలు ముద్రించారు. అందులో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( deputy CM Pawan Kalyan) పేరును ప్రచురించారు. దీంతో జనసైనికులు శాంతించారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తీరుపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ స్టామినా అది అంటూ ఇప్పుడు కొత్తగా ప్రచారం చేయడం ప్రారంభించారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జన సమీకరణలో మూడు పార్టీల నేతలు బిజీగా ఉన్నారు.
Also Read: రిజిస్ట్రేషన్ ఫీజులో భారీ రాయితీ.. ఏపీ సర్కార్ గుడ్ న్యూస్!