Amaravati Banks: నగరం నడిబొడ్డున కంటే.. నగర శివారులలో సువిశాల ప్రాంతంలో ఇల్లు కట్టుకునేందుకే ఎక్కువ మంది ఇష్టపడతారు. ఎందుకంటే నగరంలో కాలుష్యం.. ట్రాఫిక్ ఇబ్బందులు.. ఇతరత్రా సమస్యలు ఉంటాయి. అయితే అలాగని నగర శివారు ప్రాంతం కూడా ఎప్పటికైనా అభివృద్ధి చెందుతుంది అన్న నమ్మకం ఉంటుంది. కానీ ఇప్పటికే ఉన్న నగరం నడిబొడ్డున ఉండే సమస్యలు.. నగర శివారు ప్రాంతం అభివృద్ధి చెందినప్పుడు ఉండవు. ఎందుకంటే పక్కా ప్రణాళికతోనే మనం ఇల్లు కట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు అమరావతి పరిస్థితి అదే. ప్రపంచ నగరాల్లోనే హైదరాబాద్ కు( Hyderabad) గుర్తింపు ఉంది. కానీ ఆ నగరానికి ఆక్రమణలు, మూసీ నది ప్రక్షాళనలు వంటి సమస్యలు ఉన్నాయి. వాటికే లక్ష కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా. కానీ అదే లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో అమరావతి నిర్మాణం జరుగుతోంది. అది కూడా వందేళ్ళ ముందుచూపు ప్రణాళికతో. కాదనలేని సత్యం కూడా. ప్రపంచస్థాయి ప్రమాణాలతో అమరావతి నిర్మితం అయితే భారతదేశంలో అది గుర్తింపు గల నగరంగా మిగులుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు.
* నవ నగరాలు నిర్మించాలన్నది లక్ష్యం..
అమరావతి రాజధానిలో ( Amaravathi capital ) నవ నగరాలు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. చంద్రబాబు ఆలోచన కూడా. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు లక్ష్యానికి అడ్డుపడలేదు. ఎందుకంటే మూడు రాజధానులను ప్రకటించారే కానీ.. విశాఖలో పాలన రాజధానిగా అడుగుపెట్టలేకపోయారు. ఓ 500 కోట్ల రూపాయలతో రుషికొండను గుండు కొట్టించి భారీ భవంతులు నిర్మించారు. కానీ రివర్స్ టెండరింగ్ పేరుతో అమరావతి నిర్మాణ పనులు తానే ప్రారంభించి ఉంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు వచ్చి ఉండేవి కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఒక వాదనలు వినిపిస్తున్నారు. రాజధానికి ఇన్ని భవనాలు అవసరమా? ఏదో విజయవాడ, గుంటూరు మధ్య పాలనకు అవసరమైన భవనాలు నిర్మిస్తే అదే అమరావతి అవుతుంది కదా అనే తన మనసులో ఉన్న మాటను సైతం బయట పెట్టారు. అయితే ఎవరి వాదన వారిది. కానీ ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి నిర్మించడం మాత్రం సత్యం. దానిని కేంద్రం ఈనెల 28న ఆవిష్కృతం చేయనుంది.
* 12 బ్యాంకులకు ఒకేసారి..
అమరావతిలో ఉద్దండ రాయిని పాలెం లో సీడ్ యాక్సిస్ రోడ్ లో( seed Axis Road ) 12 ప్రధాన బ్యాంకుల కార్యాలయాల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో శంకుస్థాపనలు జరగనున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన పనులు.. జరగబోతున్న పనులను గ్రాఫిక్స్ గా చూపించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మునిగిపోయిన నగరం.. మునగబోతున్న ప్రాంతం.. భవిష్యత్తులో వరద బాధిత ప్రాంతం.. ఇలా ఎన్నెన్నో కట్టు కథలు.. కల్పిత కథనాలు అమరావతి చుట్టూ తిరిగాయి. అవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అభిమానించి.. జగన్మోహన్ రెడ్డికి జై కొట్టే వారికి రుచిస్తాయి. మిగతా వారికి ఎంత మాత్రం కాదు. అయితే 28న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ సమక్షంలో జరిగే శంకుస్థాపనలు దేశాన్ని అమరావతి వైపు చూసేలా చేస్తాయి. ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తప్పించి. ఎందుకంటే వారికి ఇది కంటగింపు. ఎంత మాత్రం రుచించని పని. అయితే వారు ఎన్ని అనుకున్నా 2028 ద్వితీయార్థానికి అమరావతి తుది రూపం రావడం ఖాయం.