Kurnool Bus fire Accident: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరి(Kaveri travel bus) గ్రూపునకు చెందిన ట్రావెల్ బస్సు దగ్ధమైన విషయం తెలిసిందే. హైదరాబాద్ ( Hyderabad) నుంచి ఈ బస్సు బెంగళూరు(Bengaluru) వెళ్తోంది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఈ బస్సులో మంటలు చెలరేగాయి. మండల తాకిడికి బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. బస్సు బెంగళూరు వెళుతున్న సమయంలో అందులో 40 మంది దాకా ప్రయాణిస్తున్నారు. ఇందులో కొంతమంది స్వల్ప గాయాలతో, మరి కొంతమంది తీవ్రగాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో అనేక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కావేరీ ట్రావెల్ బస్సు (Kaveri travel bus) ముందుగా కర్నూలు నగరంలోని శివారు ప్రాంతమైన ఉలిద కొండ సమీపంలో ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ బస్సు కిందకి దూసుకుపోయింది. ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. బస్సు విపరీతమైన వేగంతో ఉండడంతో నిప్పు రవ్వలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత అవి మంటలు ఏర్పడేందుకు కారణమయ్యాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించాయి. ఏసీ బస్సు కావడంతో మంటలు త్వరగానే అంటుకున్నాయి. మంటల తాకిడిని గమనించిన ప్రయాణికులలో కొంతమంది బస్సు అద్దాలను పగలగొట్టారు. అమాంతం కిందికి దూకేశారు. తెల్లవారుజామున కావడం.. చాలామంది నిద్రమత్తులో ఉండడంతో బస్సులో నుంచి బయటికి రాలేకపోయారు. దీంతో మంటలు కూడా తీవ్రంగా వ్యాపించడంతో చాలామంది సజీవ దహనమయ్యారు..
ఈ ఘటన తర్వాత పోలీసుల దర్యాప్తులో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి బస్సు ఫిట్నెస్ వాలిడిటీ ముగిసిపోయింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో ఇన్సూరెన్స్, పొల్యూషన్ వ్యాలిడిటీ ముగిసింది. ఈ బస్సు పటాన్చెరువులో నిన్న రాత్రి 9:30 సమయంలో బయలుదేరింది. హైదరాబాద్ నగరంలో అనేక స్టాపులలో ప్రయాణికులను ఎక్కించుకుంది. ఆ తర్వాత బెంగళూరు బయలుదేరింది.. వాస్తవానికి ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ గనుక అప్రమత్తమై ఉండి.. మంటలను నిలుపుదల చేసే ప్రయత్నం కనుక చేసి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.. బస్సు పూర్తిగా కాలిపోవడంతో అందులో ఉన్న వారు మొత్తం కాలిపోయారు. తమ వాళ్లు ఎక్కడున్నారు? ఏమైపోయారు? అని బంధువులు ఆరా తీస్తున్న దృశ్యాలు కంటనీరు తెప్పిస్తున్నాయి.
ఈ బస్సు డయ్యు డామన్ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ అయింది. దీనికి ఆల్ ఇండియా పర్మిట్ లేదు. కేవలం సైబరాబాద్ పరిధిలోని 16 ట్రాఫిక్ వయో లేషన్ చలాన్ లు పెండింగ్లో ఉన్నాయి. ప్రతిరోజు తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల పరిధిలో కావేరి గ్రూపుకు చెందిన బస్సులు తిరుగుతుంటాయి. ప్రమాదానికి గురైన బస్సు కూడా అలానే తిరుగుతోంది. ఇప్పటివరకు పట్టుకున్నోడు లేడు. అడిగినవాడు అంతకన్నా లేడు.. యాజమాన్యం కక్కుర్తి వల్ల.. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల దాదాపు 20 కుటుంబాలు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాయి.