Social Media Post case: ‘చంద్రబాబు గారు సారీ.. లోకేష్ గారు సారీ.. పవన్ కళ్యాణ్ గారు సారీ.. వంగలపూడి అనిత గారు సారీ’.. ఇలా క్షమాపణలు కోరింది ఎవరో తెలుసు కదా. గత ఐదేళ్లుగా సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ఒకటి ఇలా క్షమాపణలు చెప్పుకొచ్చారు… ‘ఇకనుంచి నేను రాజకీయాలు మాట్లాడను. జీవితాంతం సైలెంట్ గా ఉంటా. నేను ఎవరిని తిట్టను.. తిట్టలేదు కూడా. నేను ఎక్కువగా పొగిడింది చంద్రబాబునే. శ్రావణమాసం సినిమా రిబ్బన్ కటింగ్ రోజున 100 అడుగుల కటౌట్ పెట్టా’.. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? దర్శక,రచయిత పోసాని కృష్ణ మురళి. నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు. వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదు. వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టలేదు. ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదు. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
* స్వయంకృతాపరాధమే
అయితే సినీ సెలబ్రిటీలు గా ఉంటూ ఎంతో పేరు తెచ్చుకున్న ఇటువంటి వ్యక్తులు.. బహిరంగ క్షమాపణలు కోరడం విస్తు గొలుపుతోంది. అయితే ఇదంతా వారి స్వయంకృతాపరాధమే. నచ్చిన పార్టీకి మద్దతు తెలుపవచ్చు. నచ్చిన నేతకు మద్దతుగా ప్రచారం చేయవచ్చు. అది హుందాతనం కూడా. గతంలో సినీ రంగం నుంచి చాలామంది రాజకీయాల వైపు వచ్చారు. రాజకీయాల కోసం మాట్లాడారు. కానీ క్షమాపణలు కోరేంత పరిస్థితి ఎవరూ తెచ్చుకోలేదు. దీనికి ముమ్మాటికి ఈ ముగ్గురు చేసిన తప్పిదాలే కారణం. మితిమీరిన కామెంట్స్ తో.. ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు దిగితే పరిస్థితి ఇలానే ఉంటుంది.
* వారు ఎంతో మర్యాదగా
వాస్తవానికి వైసీపీలో వీరెవరికి సభ్యత్వాలు లేవు. వైసీపీ ఆవిర్భావం నుంచి సినీ రంగం నుంచి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, భానుచందర్, విజయ్ చందర్, కృష్ణుడు వంటి వారి మద్దతు తెలిపారు. జగన్ కు బాహటంగానే మద్దతు ప్రకటించారు. కానీ వీరెవరు వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. అటువంటి పరిస్థితి కూడా తెచ్చుకోలేదు. 2019 ఎన్నికల్లో జగన్ కోసం ప్రచారం చేశారు మోహన్ బాబు. మంగళగిరిలో లోకేష్ కు వ్యతిరేకంగా కూడా ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. అలీ కూడా ఇదే పరంపరను కొనసాగించారు. కానీ వారు రాజకీయ విమర్శల వరకే పరిమితం అయ్యారు. ఎక్కడా సోషల్ మీడియాలో రచ్చ చేయలేదు. అయితే సినీ సెలబ్రిటీలు గా ఉన్న పోసాని కృష్ణ మురళి, రాంగోపాల్ వర్మ, ఆ నటి మాత్రం అతిగా వ్యవహరించారు. అందుకు ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నారు. చివరికి క్షమాపణలు చెప్పుకునేంత స్థాయికి దిగజారి పోయారు. ఇకముందు అటువంటి తప్పు ఎవరూ చేయకుండా ఆ ముగ్గురు గుణపాఠంగా మిగులుతారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.