Tirumala Alert: తిరుమలలో( Tirumala) భక్తుల రద్దీ నెలకొంది. ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఒక్క రోజులోనే ఇలా జరగడం మరి విచిత్రంగా ఉంది. సాధారణంగా సెలవు దినాల్లో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. అయితే అనూహ్యంగా శుక్రవారం నుంచి ఒక్కసారిగా భక్తులు తిరుమలలో పెరిగారు. వీకెండ్ కారణంగానే భక్తుల రద్దీ పెరిగినట్లు టిటిడి వర్గాలు చెబుతున్నాయి. శనివారం ఒక్కరోజే ఏకంగా 92,221 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. క్యూలైన్లు రింగ్ రోడ్డు వరకు రెండు కిలోమీటర్ల మేర ఉన్నాయి. సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతుంది అంటే భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.
Also Read: ఏపీకి కొత్త నేషనల్ హైవే.. ఆ జిల్లాలకు మహర్దశ!
* టోకెన్లు దొరకక అవస్థలు..
మరోవైపు తిరుపతిలో ఎస్ ఎస్ డి టోకెన్లు( SSD tokens ) దొరకక భక్తులు ఇబ్బంది పెడుతున్నారు. తిరుపతిలో ఎస్ ఎస్ డి టోకెన్ల కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. టోకెన్లు ఇచ్చే భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసన్ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. తమకు దర్శన టికెట్లు మరుసటి రోజైనా దొరుకుతాయన్న ఆశతో.. ప్లాట్ ఫామ్ లు, రోడ్లపై తిని తినక గడుపుతున్నారు. అందుకే టీటీడీ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టోకెన్ల సంఖ్యను పెంచాలని భక్తులు కోరుతున్నారు. కాకా ఈరోజు సైతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
* టీటీడీ ప్రతిష్టాత్మక ఏర్పాట్లు..
మరోవైపు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో టీటీడీ ( Tirumala Tirupati Devasthanam) ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. పరిస్థితిని అంచనా వేసి చర్యలు చేపడుతున్నారు. ఇంకోవైపు తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయాన్ని ఆధునికరించేందుకు చెప్పటాల్సిన ప్రణాళికను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు టీటీడీ అధికారులు. మరోవైపు యాత్రికుల వసతి సముదాయం 5 భవనాన్ని పరిశీలించారు. వెయిటింగ్ హాళ్లు, శుభ్రత, భద్రతపై టీటీడీ ఈవో అధికారులతో చర్చించారు.