Homeఆంధ్రప్రదేశ్‌Actor Suman: వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి ఆ స్టార్ హీరో.. జగన్ గ్రీన్ సిగ్నల్!

Actor Suman: వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి ఆ స్టార్ హీరో.. జగన్ గ్రీన్ సిగ్నల్!

Actor Suman: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress ) సినీ గ్లామర్ పై దృష్టి పెట్టిందా? సినీ గ్లామర్ ఉన్న ఆర్టిస్టులను చేర్చుకోనుందా? ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆది నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సినీ గ్లామర్ తక్కువ. 2019 ఎన్నికల కు ముందు మోహన్ బాబు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, పోసాని కృష్ణ మురళి, అలీ వంటి వారు మద్దతు తెలిపారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కి నామినేటెడ్ పదవి దక్కింది. కానీ వివాదాల్లో చిక్కుకొని ఆయన పదవికి దూరమయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పోసాని కృష్ణ మురళి తో పాటు అలికి నామినేటెడ్ పదవులు దక్కాయి. మోహన్ బాబుకు గుర్తింపు లభించకపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు. అయితే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత సినీ నటులంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు.

Also Read: విశాఖలో వైసీపీకి షాక్.. ఆ ఉన్నది కూడా పోయింది!

* రాజకీయాలకు వారంతా గుడ్ బై
ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ఓడిపోవడంతో సినీ నటుడు అలీ( cine actor Ali ) తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చేశారు. అటు పోసాని కృష్ణ మురళి కేసుల్లో చిక్కుకున్నారు. 2019 నుంచి 2024 మధ్య వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. చిత్ర పరిశ్రమతో ఒక రకమైన వివాదం పెట్టుకుంది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఎక్కువగా వ్యతిరేకించారు. దాని ప్రభావం 2024 ఎన్నికల్లో పడింది. అయితే ఇప్పుడు దానిని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న సుమన్ పై జగన్మోహన్ రెడ్డి కన్ను పడింది. త్వరలో సుమన్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

* అగ్ర కథానాయకుడిగా..
తెలుగు చిత్ర పరిశ్రమలో సుమన్( cine actor Suman) ఒక వెలుగు వెలిగారు. తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. 90వ దశకంలో అయితే పలు హిట్ చిత్రాల్లో నటించారు. అగ్ర కథానాయకుల సరసన చేరారు. అయితే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. గతంలో మెగాస్టార్ ఫ్యామిలీతో ఆయనకు వివాదాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే వాటి గురించి సుమన్ ఎన్నడూ ప్రస్తావించలేదు కానీ చిత్ర పరిశ్రమలో మాత్రం ఒక రకమైన ప్రచారం ఉంది. సమకాలీన రాజకీయ అంశాలపై సుమన్ మాట్లాడుతుంటారు. గతంలో బిజెపి విషయంలో సానుకూలంగా ఉండేవారు. అటు తరువాత టిడిపి అధినేత చంద్రబాబు నాయకత్వంపై పొగడ్తలు కురిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

* జగన్మోహన్ రెడ్డి పై సుమన్ పొగడ్తలు
అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సుమన్ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో( YSR Congress ) చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆయన వ్యవహార శైలి కూడా అలానే ఉంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి ఆదరణ చెక్కుచెదరలేదని అభిప్రాయపడ్డారు. నాడు నేడుతో పాఠశాలలను రూపు మార్చారని.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సుమన్ టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. సుమన్ ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా.. పోయిన సినీ గ్లామర్ను తెచ్చుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Also Read: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ఎమ్మెల్యే గుడ్ బై.. నిజం ఎంత?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular