Actor Prithvi : వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy) ప్రకంపనలు రేపారు. అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోటరీ ని దూరం చేయకుంటే ఆయనకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విస్తృత చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు విజయసాయిరెడ్డి ప్రత్యర్థుల ఒత్తిడితో పార్టీ మారారు అన్న అభిప్రాయంతో ఉండేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి కోటరీ వల్లే విజయసాయిరెడ్డి పార్టీకి దూరమయ్యారని తాజాగా స్పష్టం అయ్యింది. విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు హాజరు అవుతూ.. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందని.. కాకినాడ సి పోర్టు వాటాల బదలాయింపులు తన ప్రమేయం లేదని చెబుతూ సంచలన విషయాలు బయట పెట్టారు. ఒకరిద్దరిపై ఆరోపణలు కూడా చేశారు. అవసరం అయితే మరోసారి తన వద్ద ఉన్న సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రకటించారు.
Also Read : జగన్ కోటరీ.. ఆ ఇద్దరేనా.. సాయి రెడ్డి కామెంట్స్ పై లోతైన చర్చ
* సాయి రెడ్డి పై వైసీపీ నేతల విమర్శలు
అయితే ఇప్పుడిప్పుడే రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ శ్రేణులు విజయసాయిరెడ్డి పై విరుచుకు పడటం ప్రారంభించాయి. అసలు గత పదేళ్లుగా కోటరీ అంటే మీరేనని.. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నమ్మిన కంటే ఎవరిని నమ్మలేదని.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇప్పుడు కోటరీ అంటూ చెప్పుకోవడం ఏంటని ఎక్కువ మంది నిలదీస్తున్నారు. విజయసాయిరెడ్డి వ్యవసాయం చేయడం కాదు కానీ.. చంద్రబాబుకు సాయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ సంచలన ట్వీట్ పెట్టారు. విజయసాయి రెడ్డి ఆరోపణలను జగన్మోహన్ రెడ్డికి లింక్ చేస్తూ.. పృథ్వి పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
* వైసిపి టార్గెట్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన పృథ్వి( actor Prithvi ) ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటున్నారు. కొద్ది రోజుల కిందట ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని 11 గొర్రెలతో పోల్చారు. అక్కడితో ఆగకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. కాకినాడ సి పోర్టు వాటాల కేసులు ప్రధానంగా ఉన్నది వైవి విక్రాంత్ రెడ్డి అని విజయసాయిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పృథ్వి జగన్మోహన్ రెడ్డి సోదరుడు ఈ దందాకు పాల్పడ్డాడంటూ ఆరోపించారు. జగన్ సోదరుడు వైవి విక్రాంత్ రెడ్డి అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి. దీంతో జగన్మోహన్ రెడ్డికి సుబ్బారెడ్డి బాబాయ్ అవుతారు. సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ జగన్మోహన్ రెడ్డికి సోదరుడు అవుతారు. ఈ లెక్కనే జగన్మోహన్ రెడ్డికి లింక్ చేశారు. గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో దాచుకో.. దోచుకో అంటూ వ్యవహారం నడిచిందని చెప్పుకొచ్చారు పృథ్వి. మొత్తానికి అయితే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.
Also Read :విజయసాయిరెడ్డిని వదిలేదిలే.. పల్నాడు జిల్లాలో ఫిర్యాదు.. అరెస్టుకు రంగం సిద్ధం!
కాకినాడ పోర్టు వాటాల కేసులో కర్త కర్మ క్రియ వైసీపీ విక్రాంత్ రెడ్డి (జగన్ మోహన్ రెడ్డి సోదరుడు) అయన. – @VSReddy_MP
రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకోవాలో వైఎస్సార్సీపీ కి తెలిసినట్టు ఎవ్వరికి తెలియదు ..
Ycp సింగిల్ పాలసీ“దోచుకో దాచుకో “pic.twitter.com/eKYsoHFs9G
— prudhvi actor (@ursprudhviraj06) March 12, 2025