TS First Cabinet Expansion: తెలంగాణలో ఏడాదిన్నర తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా ముగ్గురు మంత్రులను సీఎం రేవంత్‌రెడ్డి తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. అయితే వారికి శాఖల కేటాయింపునకు మూడు రోజుల సమయం పట్టింది. ఇందుకోసం అధిష్టానం.. క్షీరసాగర మధనం చేసినంత బిల్డప్ ఇచ్చింది. కానీ చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా శాఖలు కేటాయించింది.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో జూన్ 8న మంత్రివర్గ విస్తరణ చేశారు. ఏడాదిన్నర పాలనలో మంత్రివర్గ విస్తరణ అనేకమార్లు వాయిదా పడింది. చివరకు అధిష్టాన్ గ్రీన్ సిగ్నల్‌తో ఆరు ఖాళీల్లో మూడు భర్తీ చేశారు. ఇద్దరు ఎస్సీలు, ఒక బీసీకి పదవి ఇచ్చారు. అయితే వారికి శాఖల కేటాయింపునకు సీఎం రేవంత్ మళ్లీ ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. అధిష్టానం కూడా ముగ్గురికి పదవులు ఇచ్చేందుకు మూడు రోజులు మేధో మథనం చేసింది. చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎలాంటి మార్పులు లేకుండా ముగ్గురికి శాఖలు కేటాయించింది. దీంతో ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ కేటాయంపు ప్రక్రియలో కాంగ్రెస్ అధిష్టానం సీనియారిటీ, అనుభవం, పార్టీ లోయల్టీని దష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంది.
కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవీ..
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, కొత్త మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఇలా ఉన్నాయి.
- గడ్డం వివేక్: కార్మిక, మైనింగ్ శాఖలు
- వాకిటి శ్రీహరి: పశుసంవర్థక, క్రీడలు, యువజన శాఖలు
- అడ్లూరి లక్ష్మణ్: ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ
శాఖల కేటాయింపుపై పార్టీలో హాట్ టాపిక్
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అంశం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎవరికి ఏ శాఖ దక్కుతుందనే చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. పార్టీ అధిష్టానం ఈ కేటాయంపులపై లోతైన చర్చలు జరిపి, సమతుల్యతను కాపాడేలా నిర్ణయాలు తీసుకుంది.
Also Read: KTR Slams Revanth Reddy: రేవంత్ రెడ్డిని మీడియా ఎందుకు కాపాడుతోంది?
ఢిల్లీలో కసరత్తు..
శాఖల కేటాయింపు విషయంలో సమగ్ర చర్చల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో శాఖల కేటాయింపుపై విస్తతంగా చర్చించి, అంతిమ నిర్ణయానికి వచ్చారు.
సీనియారిటీ, అనుభవానికి ప్రాధాన్యత
కాంగ్రెస్ అధిష్టానం ఈ శాఖల కేటాయింపు విషయంలో సీనియారిటీ, అనుభవం, ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంది. ఈ కేటాయంపులు పార్టీలో ఐక్యతను, రాష్ట్రంలో పరిపాలనా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read: MLC Kavitha: రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత షాకింగ్ కామెంట్స్
ఉత్తం, భట్టిని ఎందుకు పిలిపించినట్లు..
తెలంగాణ కేబినెట్ విస్తరణ తర్వాత ప్రస్తుతం ఉన మంత్రుల శాఖలు కూడా మారుతాయని అంతా భావించరు. ఈమేరకు అధిష్టానం కూడా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించింది. దీంతో చాలా మంది శాఖలు మారుతాయన్న సంకేతాలు వెలువడ్డాయి. కానీ అధిష్టానం మాత్రం పెద్ద హైప్ తీసుకొచ్చి.. తుస్సుమనిపించింది. ప్రస్తుత మంత్రుల శాఖలు మార్చకుండా.. కొత్తవారికి శాఖలు కేటాయించింది.
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో సమర్థవంతమైనితీరుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.