AB Venkateswara Rao: జగన్ కు షాక్ ఇచ్చిన ఏబి వెంకటేశ్వరరావు

ఎన్నికల ఫలితాలకు ముందు జగన్ కు ఎదురు దెబ్బ తగిలిందని టాక్ ప్రారంభమైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా అడుగులు వేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది.

Written By: Dharma, Updated On : May 31, 2024 2:22 pm

AB Venkateswara Rao

Follow us on

AB Venkateswara Rao: ఏపీకి చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట దక్కింది. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేస్తూ.. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్.. క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ హైకోర్టుఆదేశాలు జారీచేసింది.క్యాట్ ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సైతం కొట్టేసింది. ఏకంగా పిటిషన్ ను కొట్టివేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది.వాస్తవానికి ఈ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. గురువారం ఏకంగా ఉత్తర్వులు జారీచేసింది.

ఎన్నికల ఫలితాలకు ముందు జగన్ కు ఎదురు దెబ్బ తగిలిందని టాక్ ప్రారంభమైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా అడుగులు వేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది.2019లో వైసిపి అధికారంలోకి వచ్చింది మొదలు ఏబీ వెంకటేశ్వరరావు పై సస్పెన్షన్ వేట కొనసాగుతూ వస్తోంది. ఏదో ఒక కారణం చూపుతూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ వచ్చారు.ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు ఇజ్రాయిల్ లో ఆయుధాల వ్యాపారం చేశారన్నది అభియోగం.అందులో ఏబి వెంకటేశ్వరరావు పాత్ర కూడా ఉందన్నది రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రధాన ఆరోపణ.ఆ కారణం చూపుతూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.కానీ న్యాయస్థానంలో చెల్లుబాటు కాలేదు. మరోసారి ఆయనకు పోస్టింగ్ ఇవ్వక తప్పలేదు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటూ రెండు రోజులకే మరోసారి సస్పెన్షన్ వేటు పడింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలను క్యాట్ కూడా సమర్ధించింది. కానీ సస్పెండ్ ను వ్యతిరేకించింది.

అయితే ఏబీ వెంకటేశ్వరరావు కర్కశంగా వ్యవహరించింది. ఆయనకు నిలిపివేసిన జీతభత్యాలు, ఇతరత్రా అలవెన్సులు ఇవ్వాలని క్యాట్ ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. పైగా క్యాట్ ఆదేశాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది రాష్ట్రప్రభుత్వం.క్యాట్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేసింది.కానీ కోర్టు ఈ పిటిషన్ ను ఏకపక్షంగా కొట్టేసింది. ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకోవాలని కానీ.. తీసుకోవద్దని కానీ ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఇప్పుడు వెంకటేశ్వరరావు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలకు దిగుతుందో చూడాలి.