Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు, ఆయన సంపాదించిన అవార్డులే మనకు ఆయన గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటాయి. ఇక ఆయన ఏ సినిమా చేస్తున్నాడు అనేది పక్కన పెడితే ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఆయన అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఆయన ఫ్లాప్ సినిమాకి కూడా మిగతా హీరోల హిట్ సినిమాకి వచ్చినన్ని కలెక్షన్స్ వస్తూ ఉంటాయి.
ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ డిఫరెంట్ జానర్స్ లో సినిమా చేసి మంచి సక్సెస్ లను అందుకున్నాడు. కానీ ఆయన దేవుడుగా చేసిన ‘గోపాల గోపాల’ సినిమా మాత్రం ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. అయితే ఈ సినిమా ఎందుకు ఆడలేదు అనే విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ దేవుడిగా అద్భుతమైన నటనని కనబరిచాడు. కానీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని దక్కించుకోలేదు.
అప్పటినుంచి పవన్ కళ్యాణ్ దేవుడిగా పాత్రలు చేయడం మానేసినట్టుగా తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట. ఎందుకంటే తనను తాను దేవుడుగా ప్రజెంట్ చేసుకోవడం ఇష్టం లేదట. అయితే గోపాల గోపాల సినిమాలో ఆ క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో ఆయన ఆ పాత్రను చేయాల్సి వచ్చింది. ఇక ఆ జానర్ లో సినిమాలు చేస్తే అతనికి అంతగా కలిసి రావడం లేదనే ఉద్దేశ్యం తోనే తను కమర్షియల్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు.
ఇక గోపాల గోపాల సినిమా బాలీవుడ్ లో వచ్చిన ఓ మై గాడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ఇక ఇప్పుడు ఓ మై గాడ్ కి సీక్వెల్ గా ఓ మై గాడ్ 2 అనే సినిమా కూడా వచ్చింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆ సినిమాకి సిక్వెల్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే వార్తలైతే వస్తున్నాయి. ఇక కొంతమంది పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాని రీమేక్ చేయాలి.అనుకున్నప్పటికి ఆ సినిమా మీద పవన్ కళ్యాణ్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదట…