Sathyaraj: రాజమౌళి-మహేష్ మూవీలో సత్యరాజ్… ఓపెన్ గా చెప్పేసిన బాహుబలి కట్టప్ప!

బాహుబలి సిరీస్ అనంతరం తెలుగులో సత్యరాజ్ కి ఆఫర్స్ మరింత పెరిగాయి. ఆయన లేటెస్ట్ మూవీ వెపన్. జూన్ 7న విడుదల కానుంది. ఈ క్రమంలో టాలీవుడ్ మీడియాతో ఆయన ముచ్చటించారు.

Written By: S Reddy, Updated On : May 31, 2024 2:17 pm

Sathyaraj

Follow us on

Sathyaraj: నటుడు సత్యరాజ్ తెలుగులో కూడా పాప్యులర్. కెరీర్ బిగినింగ్ లో కోలీవుడ్ హీరోగా సత్తా చాటిన ఈ టాలెంటెడ్ యాక్టర్… క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా చిత్రాలు చేస్తున్నారు. బాహుబలి సిరీస్ ఆయనకు ఎనలేని గుర్తింపు తెచ్చింది. బాహుబలి చిత్రాల సక్సెస్ లో ఆయన పాత్ర ఎంతగానో ఉంది. బాహుబలి వన్ విడుదల తర్వాత ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి..?’ అనే ట్యాగ్ బాగా ప్రాచుర్యం పొందింది.

బాహుబలి సిరీస్ అనంతరం తెలుగులో సత్యరాజ్ కి ఆఫర్స్ మరింత పెరిగాయి. ఆయన లేటెస్ట్ మూవీ వెపన్. జూన్ 7న విడుదల కానుంది. ఈ క్రమంలో టాలీవుడ్ మీడియాతో ఆయన ముచ్చటించారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాహుబలి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన రాజమౌళికి ధన్యవాదాలు. అంతకు ముందు నేను సత్యరాజ్ గా సౌత్ ఇండియాకు మాత్రం తెలుసు. కట్టప్పగా వరల్డ్ వైడ్ గుర్తించేలా బాహుబలి చిత్రాలు చేశాయి. బాహుబలి చిత్రంలో నాకు కండలు ఉన్నట్లు చూపించారు.

యానిమేషన్ వెర్షన్ లో మరింత ఎక్కువగా ఆ కండలు చూపించారు. పిల్లలు నిజంగా నాకు విపరీతమైన కండలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ 29లో నటించాలని నాకు ఎలాంటి ఆఫర్ రాలేదు. ఒకవేళ రాజమౌళి అడిగితే కచ్చితంగా మహేష్ మూవీలో నటిస్తాను. మోడీ బయోపిక్ లో నేను నటిస్తున్నానని పుకార్లు వస్తున్నాయి. ఆ పుకార్లలో నిజం లేదు.

నేను, మోడీ చూడటానికి ఒకేలా ఉంటాము. దాంతో కొందరు మోడీ, నా ఫోటో పక్కపక్కనే పెట్టి వార్తలు క్రియేట్ చేశారు. అంతే కానీ మోడీ బయోపిక్ లో నేను నటిస్తున్నానన్న వార్తలో నిజం లేదు అన్నారు. ప్రస్తుతం సత్యరాజ్ వయసు 68 ఏళ్ళు. వెపన్ మూవీలో ఆయన 28 ఏళ్ల యువకుడిగా కనిపించనున్నాడట. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సత్యరాజ్ ని యువకుడిగా వెపన్ మూవీలో ప్రజెంట్ చేయనున్నారని సమాచారం.