Chandrababu : చంద్రబాబుపై యువతి పాట.. సోషల్ మీడియాలో వైరల్

చంద్రబాబు పరిపాలన కీర్తిస్తూ.. ఆయన పాలన సామర్థ్యాన్ని కొనియాడుతూ ఓ యువతి పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాటను టిడిపి శ్రేణులు సోషల్ మీడియాలో తెగ పోస్ట్ చేస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 11, 2024 9:23 pm

CM Chandrababu

Follow us on

Chandrababu :  ఆంధ్రప్రదేశ్లో వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద బాధితులకు కూరగాయలు, ఆహారం, పాలు, నిత్యావసరాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల విజయవాడలో బుడమేరుకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. ఈ సందర్భంగా వరద నీరు విజయవాడ నగరాన్ని చుట్టుముట్టింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో వరద బాధిత ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచింది.. ముంపు ప్రాంతాల ప్రజలకు పునరవాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. వారికి ఆహారం అందించింది. నగరవాసులకు ఆహారం కొరత లేకుండా చూసింది. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్వింటాళ్లకొద్ది ఆహారాన్ని సిద్ధం చేసి వరద బాధితులకు పంపిణీ చేసింది. చివరికి విజయవాడ నగరంలోని హోటళ్ల ల్లో ఆహారం వండించి బాధితులకు అందించింది..

చంద్రబాబు నిరంతరం పర్యవేక్షించడంతో..

ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సింహభాగం లభించింది. దీనికి తోడు అమరావతి నగర నిర్మాణం పున: ప్రారంభం కాబోతోంది. వరదల వల్ల అపారంగా నష్టం ఉన్నప్పటికీ.. చంద్రబాబు నిరంతరం పర్యవేక్షించడం వల్ల విజయవాడ నగరానికి ఆ ముప్పు స్వల్ప కాలంలోనే తప్పింది. ఇక ఈ క్రమంలో చంద్రబాబు గతంలో నిర్వహించిన ఓ సమీక్ష సమావేశంలో కొంతమంది యువతులు పాల్గొన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పరిపాలన దక్షతపై ఓ యువతి అప్పటికప్పుడు పాట రూపొందించింది. చంద్రబాబు అనుమతితో ఆ పాటను పాడింది.. చంద్రుడా చంద్రుడా అనే పల్లవితో ప్రారంభమైన ఈ పాట.. చంద్రబాబు పరిపాలన దక్షతను వివరించింది. ఇక ఈ పాటను ప్రస్తుతం వరదల సమయంలో చంద్రబాబు చూపించిన తెగువను చూపిస్తూ టిడిపి అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేలల్లో వీక్షణలు సొంతం చేసుకుంది. అయితే ఈ పాటపై వైసీపీ అభిమానులు ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ.. టిడిపి శ్రేణులు వెనక్కి తగ్గడం లేదు. అందుబాటులో ఉన్న అన్ని సామాజిక మాధ్యమాలలో వారు ఈ పాటను పోస్ట్ చేస్తున్నారు.

టిడిపి అభిమానులు ఏమంటున్నారంటే

“చంద్రబాబు గొప్ప పరిపాలన దక్షుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిపాలనలో తన మార్పు చూపించాడు.. మార్క్ ప్రదర్శించాడు. హైదరాబాద్ నగరాన్ని సైబర్ సిటీగా మార్చాడు. అటువంటి వ్యక్తి గురించి ఆ యువతి పాడిన పాట గొప్పగా ఉంది.. చంద్రబాబు పాలన తీరును అది ప్రదర్శిస్తోంది. ఇలాంటి సమయంలో వైసీపీ నాయకులు ఏవేవో విమర్శలు చేస్తున్నారు. అలాంటి చమకబారు విమర్శలు చేశారు కాబట్టే ప్రజలు చంద్రబాబును గెలిపించారు.. ముఖ్యమంత్రిని చేశారని” టిడిపి అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.