OTT Horror Movie : థియేటర్స్ లో ఎప్పటికైనా అద్భుతమైన అనుభూతి కలిగించే సినిమాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి హారర్ జానర్ సినిమాలే. మనకి తెలిసినవి రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘దెయ్యం’, ‘రాత్రి’ వంటివి మాత్రమే. వీటిని చూసి ఆమ్మో, అసలు ఇంత భయంకరంగా ఎలా తీసాడు?, థియేటర్స్ లో ఈ సినిమాని చూసిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అనుకుంటూ ఉంటాము. వాస్తవానికి ఓటీటీ లో సినిమాలు చూసే అలవాటు ఉన్నవారికి, ఇంగ్లీష్ సినిమాలను రెగ్యులర్ గా అనుసరించే వారికి రామ్ గోపాల్ వర్మ సినిమాలు పెద్దగా భయం వెయ్యవు. ఇప్పుడు ఆయన కూడా అలాంటి సినిమాలు తియ్యడం ఆపేసాడు. మన తెలుగులో ఇటీవల కాలంలో హారర్ జానర్ సినిమాలు చూసి భయపడినవి ఏవైనా రెండు చెప్పమని అడిగితే, టక్కుమని ‘మాసూద’ సినిమా పేరు చెప్తాము. ఈ చిత్రం నిజంగానే ఆడియన్స్ కి థియేటర్స్ లో వణుకు పుట్టించింది, కమర్షియల్ గా కూడా బాగా సక్సెస్ అయ్యింది.
కానీ కొంతకాలం క్రితం ఓటీటీ లో విడుదలైన ఒక హాలీవుడ్ హారర్ చిత్రాన్ని చూసి విదేశాల్లో ఒక జంట గుండె ఆగి చనిపోయారు అని చెప్తే మీరు నమ్మగలరా?, కానీ నమ్మాలి, ఎందుకంటే అది నిజం కాబట్టి. నెట్ ఫ్లిక్స్ లో కొంతకాలం క్రితమే ‘స్మైల్’ అనే హారర్ సినిమాని అప్లోడ్ చేసారు. ఇది థియేటర్స్ లో విడుదలైంది 2022 వ సంవత్సరం లో, కానీ నెట్ ఫ్లిక్స్ లో ఆలస్యంగా విడుదల చేసారు. ఈ సినిమా థియేట్రికల్ గా సక్సెస్ అయ్యింది, అలాగే ఓటీటీ లో కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమా పోస్టర్స్ ని చూస్తేనే విచిత్రంగా ఉంది కదూ. ఆ నవ్వు ముఖం మనల్ని అలా వెంటాడుతూనే ఉంటుంది. సినిమాలో అలాంటి భయంకరమైన నవ్వు మనల్ని వణికించేలా చేస్తుంది. అనేక సన్నివేశాలకు మనం సీట్స్ నుండి ఉలిక్కిపడి లేచి కూర్చుకుంటాము. ఒంటరిగా చూస్తున్న సమయంలో కచ్చితంగా భయం వేస్తుంది. అప్పుడు అమ్మానాన్న లను నిద్ర లేపి మరీ తమ పక్కన కూర్చోబెట్టుకుంటాము. అది కూడా సరిపోక లైట్లు వేసి మరి భయం తో ఈ సినిమాని చూస్తాము. ఆ స్థాయిలో ఈ చిత్రం ఉంటుంది.
ఈ సినిమాని చూసిన తర్వాత కచ్చితంగా రాత్రి నిద్రపోగలను అనే ధైర్యం ఉంటేనే చూడండి. దీనికి బాబు లాంటి సినిమాలను ఎన్నో చూసి తట్టుకున్న గుండె ఇది అని అతి ఆత్మ విశ్వాసంతో మాత్రం ఈ సినిమాని చూడకండి. నేను కూడా మీలాగా ధైర్యం తో ఈ చిత్రాన్ని చూసి, ఆ తర్వాత వణికిపోయింది వాడినే. కానీ కచ్చితంగా ఒక అద్భుతమైన హారర్ అనుభూతి కలగాలి, మమల్ని భయపెట్టే హారర్ చిత్రం వచ్చి చాలా కాలం అయ్యింది అని అనుకునేవాళ్లు మాత్రం ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలో కూడా మిస్ అవ్వకండి. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది, తెలుగు ఆడియో లేదు, కేవలం ఇంగ్లీష్ ఆడియో మరియు సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.