https://oktelugu.com/

Sobhita Dhulipalla: ఒకపక్క నాగ చైతన్య తో పెళ్లి..మరోపక్క ఆ స్టార్ హీరోతో రొమాన్స్..హద్దులు దాటేస్తున్న అక్కినేని కోడలు!

శోభిత ఇంకా పెళ్లి కూడా కాకముందే ఎలా రెచ్చిపోతుందో, అసలు ఈమె 'ది నైట్ మ్యానేజర్' అనే వెబ్ సిరీస్ లో హీరో తో చేసిన రొమాన్స్ చూస్తే ఇలాంటి అమ్మాయిని అక్కినేని కుటుంబం ఎలా అంగీకరించింది అని తిడుతారు

Written By:
  • Vicky
  • , Updated On : September 11, 2024 / 09:12 PM IST

    Sobhita Dhulipalla

    Follow us on

    Sobhita Dhulipalla : సాధారణంగా పెళ్ళికి దగ్గరైన హీరోయిన్లు చాలా పద్దతిగా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. కనీసం పెళ్లి వరకైనా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ తర్వాత భర్త అనుమతితో ఏదైనా చేయాలనుకుంటే చేస్తారు. కానీ శోభిత దూళిపాళ్ల చాలా స్పీడ్ గా ఉంది. నిన్నగాక మొన్న నాగ చైతన్య తో నిశ్చితార్థం చేసుకుంది, ఇప్పుడు వేరే హీరోని ముద్దాడుతూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘లవ్, సితార’ అనే చిత్రం జీ 5 యాప్ లో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చెయ్యగా అది తెగ వైరల్ గా మారింది. ఈ ట్రైలర్ లో ఆమె రాజీవ్ సిద్దార్థ అనే హీరో ముక్కు మీద ముద్దు పెడుతూ ఒక షాట్ లో కనిపిస్తుంది. అంతే కాదు ఆ ట్రైలర్ లో అలాంటి రొమాంటిక్ షాట్స్ చాలానే ఉన్నాయి. వీటిని నెటిజెన్స్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ వెబ్ సిరీస్ లో సన్నివేశం డిమాండ్ ని బట్టి రెండు మూడు ఇంటిమేట్ సీన్స్ లో నటిస్తే తెగ రచ్చ చేసారు. ఇక్కడ చూడండి శోభిత ఇంకా పెళ్లి కూడా కాకముందే ఎలా రెచ్చిపోతుందో, అసలు ఈమె ‘ది నైట్ మ్యానేజర్’ అనే వెబ్ సిరీస్ లో హీరో తో చేసిన రొమాన్స్ చూస్తే ఇలాంటి అమ్మాయిని అక్కినేని కుటుంబం ఎలా అంగీకరించింది అని తిడుతారు.

    ఆ స్థాయిలో ఆమె రొమాన్స్ లో రెచ్చిపోయింది, పాపం నాగ చైతన్య కూడా ఇప్పటి వరకు ఆమెతో ఆ స్థాయి రొమాన్స్ చేసి ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా అన్న తర్వాత ఇవన్నీ కచ్చితంగా ఉంటాయి. ఇవి ఉంటాయి అని తెలిసినప్పటికీ నాగ చైతన్య ఇష్టపడి ఆమెని పెళ్లి చేసుకుంటున్నాడు. ఆయనకి ఎలాంటి సమస్య లేకపోయి ఉండొచ్చు, కానీ అభిమానులు ఇలాంటి విషయాల్లో తల ఎత్తుకోలేరు కదా అనేది విశ్లేషకుల పాయింట్. ఇలా పెళ్ళికి ముందే ముద్దు సన్నివేశాలు ఉన్న సినిమాలను విడుదల చేస్తే జనాలు ఏమనుకుంటారు అంటూ సోషల్ మీడియా లో కొంతమంది అక్కినేని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఇదంతా పక్కన పెడితే శోభిత పక్కా తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈమె తెనాలి లోనే పెరిగింది. హైదరాబాద్ లో మోడల్ గా రాణించిన ఈమె, ఆ తర్వాత అడవి శేష్ సినిమాల ద్వారా మన టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తర్వాత ఈమెకు బాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి. పేరుకి తెలుగు అమ్మాయే కానీ, బాలీవుడ్ కల్చర్ ని బాగా అలవాటు చేసుకుంది శోభిత. అందుకే ఇలాంటి విషయాల్లో సోషల్ మీడియా లో తనపై నెగటివిటీ పెరిగినా పెద్దగా పట్టించుకోదు. ప్రస్తుతం ఈమె హిందీ లో మూడు సినిమాలు, రెండు వెబ్ సిరీస్ లు చేస్తుంది.