Politics Lookback 2024 : ఎవరైనా.. ఎంతటి వారైనా కాలాన్ని నమ్మాలి. ఇది సత్యం కూడా. కొందరు ఎంత ప్రయత్నించినా సక్సెస్ కాలేరు. మరికొందరు చిన్న ప్రయత్నం తోనే గట్టెక్కగలరు.అందుకే మన టైం బాగోలేదు అన్న మాట ఎక్కువగా వినిపిస్తుంది.ఈ సమయంలో ఏది చేసినా మనకు ప్రతికూలమే అన్నట్టు కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. అయితే టిడిపి యువనేత నారా లోకేష్ విషయంలో మాత్రం మంచి కాలమే నడుస్తుందని చెప్పాలి.కానీ గత ఐదేళ్లుగా ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఆయనపై వచ్చిన విమర్శలు తక్కువ కావు.ఆయనను టార్గెట్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి దిగిన సందర్భాలు కూడా అధికమే.అసలు నాయకుడిగా గుర్తించేవారు కాదు. ఆపై ఎగతాళి చేసేవారు.కానీ ప్రతి క్షణాన్నితన లక్ష్యానికి వాడుకున్నారు లోకేష్. కానీ ఆయన కృషికి మాత్రం గుర్తింపునిచ్చిన కాలం 2024. ఇంతింతై.. అన్న మాదిరిగా లోకేష్ తన ప్రస్థానాన్ని తానే పెంచుకున్నారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని.. రాజకీయ యవనికపై తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అందుకే 2024 నారా లోకేష్ కు స్పెషల్. మరి కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో.. నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం గురించి ఒకసారి చర్చించుకుందాం.
* 2009 నుంచి సేవలు
2009 ఎన్నికల్లో తెరవెనుక పార్టీకి సేవలు అందించారు నారా లోకేష్. ఎక్కడో విదేశాల్లో చదువుకుంటూ వచ్చిన ఆయన.. 2009లో టిడిపి మేనిఫెస్టోలో నగదు బదిలీ పథకంపెట్టిన ఘనత లోకేష్ దే. 2014 ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టలేదు లోకేష్.అప్పుడు కూడా పార్టీకి తెర వెనుక పని చేశారు. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. టిడిపి అధికారంలోకి రావడంతో పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు లోకేష్. అయితే 2017లో లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. ఎమ్మెల్సీ ని చేసి ఆపై మంత్రి పదవి ఇచ్చారు.చంద్రబాబు చేసిన తప్పిదం అదేనని విశ్లేషకులు ఇప్పటికీ చెబుతుంటారు. తండ్రి చాటు బిడ్డగా లోకేష్ ను ప్రత్యర్ధులు అభివర్ణిస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ లాంటి వాళ్లు ప్రత్యక్ష రాజకీయాల ద్వారా,ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ లోకేష్ ను మాత్రం అలా చేయలేదు చంద్రబాబు.అది లోకేష్ పొలిటికల్ కెరీర్ కు ఇబ్బందిగా మారింది. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఇన్నేళ్ల సమయం పట్టింది.
* చాలా ఇబ్బందులను అధిగమించి
ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఒక రాజకీయ వారసుడు లోకేష్ మాదిరిగా ఇబ్బంది పడి ఉండేవారు కాదు. చంద్రబాబు ప్రత్యర్థులు లోకేష్ కు ప్రత్యర్థులుగా మారారు. లోకేష్ ఎదుగుదలను తట్టుకోలేని వారు సైతం టార్గెట్ చేసుకున్నారు. లోకేష్ పై దుష్ప్రచారం చేశారు. చివరకు ఆయన బాడీ షేమింగ్ పై కూడా మాట్లాడారు. ఆయన రాజకీయాలకు పనికి రారని ముద్రవేశారు. 2019 ఎన్నికల్లో మంత్రిగా ఉంటూ ఓడిపోవడంతో దారుణంగా ఆయనపై మాట్లాడారు. చివరకు యువగలం పేరిట పాదయాత్ర చేసిన అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన చిన్న తడబాటుకు గురైన ఓ లెవెల్ లో ప్రచారం చేశారు. కానీ లోకేష్ ఇప్పుడు చింతించలేదు. తనకు తానుధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో ఆయన ఒక కారణమయ్యారు. పార్టీలో ఇప్పుడు కీలకంగా మారారు. ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే లోకేష్ కష్టాన్ని.. బిజీగా మార్చి ఇచ్చింది మాత్రం 2024. అందుకే ఈ ఏడాది లోకేష్ కు స్పెషల్.