Meenakshi Chaudhary : ఇటీవల కాలం లో ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్త హీరోయిన్స్ లో ఆడియన్స్ బాగా దగ్గరైన వాళ్లలో ఒకరు మీనాక్షి చౌదరి. ఈమె సుశాంత్ హీరో గా నటించియున్న ‘ఇచట వాహనములు ఆపరాదు’ అనే చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ, ఈమెకు అవకాశాలు క్యూలు కట్టాయి. ఆ తర్వాత ఈమె చేసిన చిత్రాలలో ‘హిట్ : ది సెకండ్ కేస్’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. మిగిలిన సినిమాలన్నీ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. వరుసగా ఫ్లాప్స్ వచ్చినప్పటికీ ఈమె నిర్మాతలకు చుక్కులు చూపిస్తుంది. కేవలం రెమ్యూనరేషన్ విషయం లో మాత్రమే కాదు. ఈమె హైదరాబాద్ లో ఉండేందుకు కూడా డబ్బులు చెల్లించాలట. సాధారణంగా హీరో/ హీరోయిన్స్ కి హోటల్ రూమ్స్ బుక్ చేసి వాళ్లకు అవసరమైన అన్ని పనులు చూసుకుంటారు మేకర్స్.
కానీ అది కేవలం నాన్ లోకల్ గా ఉండే వాళ్లకు మాత్రమే ఇలా చేస్తారు. కానీ మీనాక్షి చౌదరి లోకల్. ఈమెకు హైదరాబాద్ లో సొంత ఫ్లాట్ కూడా ఉంది. కానీ ఈమె తన సొంత ఫ్లాట్ లో ఉండేందుకు కూడా నిర్మాతలను రోజుకి 18 వేల రూపాయిలు డిమాండ్ చేస్తుందట. హైదరాబాద్ లో షూటింగ్ ఎన్ని రోజులైతే ఉంటుందో, అన్ని రోజులు ఈమెకి 18 వేల రూపాయిలు ఇవ్వాలట. ఇదెక్కడి నిలువు దోపిడీరా బాబు అని నిర్మాతలు తలలు బాదుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. సినిమా చేస్తున్నందుకు ఈమెకి రెమ్యూనరేషన్ తో పాటు, రోజుకి 18 వేల రూపాయిల రెమ్యూనరేషన్ అనేది చాలా అన్యాయం అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇండస్ట్రీ లో స్థిరపడి, ఉన్నత స్థాయిలో ఉండే హీరోయిన్స్ కూడా ఈ రేంజ్ డిమాండ్స్ చేయడం లేదని, మీనాక్షి ఎదో అవకాశాలు వస్తున్నాయి కదా అని రెచ్చిపోతుందంటూ ఈమెపై నెటిజెన్స్ మండిపడుతున్నారు.
‘లక్కీ భాస్కర్’ చిత్రం తర్వాత ఈమె వరుణ్ తేజ్ తో కలిసి నటించిన ‘మట్కా’ అనే చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ సినిమా ఒక్కటే కాదు , గుంటూరు కారం, మెకానిక్ రాకీ, ఖిలాడీ వంటి చిత్రాలు కూడా డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. కెరీర్ లో ఇన్ని ఫ్లాప్స్ పెట్టుకొని కూడా ఈమె రేంజ్ లో నిర్మాతలకు డబ్బుల విషయంలో చుక్కలు చూపించాలని అనుకోవడం ఆశ్చర్యానికి గురి చేసే విషయం. ప్రస్తుతం ఈమె చేతిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చిత్రం మాత్రమే ఉంది. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఈ చిత్రం విడుదల కాబోతుంది.