Vijayasai Vs ABN RK: విజయసాయిరెడ్డి, వేమూరి రాధాకృష్ణ మధ్య ఎపిసోడ్ మొత్తానికి రసకందాయంలో పడింది. వీరిద్దరి మధ్య ఎవరు పులు కలిగిన ముత్యాలో.. ఎవరు సానబెట్టిన వజ్రాలో తెలవాల్సిన తరుణం ఇదేనని తెలుగు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు.. తెలుగు నాట మీడియా, రాజకీయ పార్టీల మధ్య వివాహేతర సంబంధాలు సాగుతున్న ఈ కాలంలో.. బండారాలు ఒక్కసారిగా వెలుగు చూస్తే బాగుంటుందని తెలుగు ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ వేమూరి రాధాకృష్ణ తనకు తానుగా బయటికి రారట. తన ఛానల్ లో డిబేట్ కు విజయసాయిరెడ్డి వస్తేనే అసలు విషయాలు బయటపెడతారట. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసుకునే అవకాశాన్ని సాక్షి ఛానల్ కు రాధాకృష్ణ ఇస్తారట. అయితే దీనికి విజయసాయిరెడ్డి బలమైన కౌంటర్ ఇచ్చారు. మద్యం, ఖనిజ సిండికేట్ బ్రోకర్లతో నువ్వు చేసిన బ్రోకరిజం మాటేమిటోయ్ అంటూ రాధాకృష్ణను దుయ్యబడుతున్నారు. రాధాకృష్ణ సంపాదించిన అక్రమ ఆస్తుల గురించి కూడా బయట పెడతానని సంచలన ట్వీట్ చేస్తున్నారు. సో ఈ లెక్కన విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు.. తన శల్యత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత రాధాకృష్ణ మీద ఉంది. అయితే ఇక్కడ అటు రాధాకృష్ణ, ఇటు విజయసాయిరెడ్డి ఢిల్లీలో చర్చ నిర్వహించాలి అనుకుంటే.. కచ్చితంగా అక్కడి ప్రముఖ మీడియా సంస్థలను కూడా పిలిస్తే బాగుంటుంది. వీలైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రమ్మనాలి. ఒకవేళ ఆయన బిజీగా ఉంటే అమిత్ షా నైనా రావాలని కోరాలి. అప్పుడే వారి సమక్షంలో తమ కళ్ళను వేమూరి రాధాకృష్ణ, విజయసాయిరెడ్డి తెరిపించాలని సగటు తెలుగు న్యూట్రల్ రీడర్ల కోరిక.
ఇదే మంచి తరుణం
పాత్రికేయంలో రాధాకృష్ణ తనకు తానుగా దమ్మున్న జర్నలిస్టుగా చెప్పుకుంటారు. తన పత్రికను, తన ఛానల్ ను గొప్పగా కీర్తించుకుంటారు. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి కూడా తనకు తానుగా గొప్పతనం కలిగిన రాజకీయ నాయకుడిగా అభివర్ణించుకుంటారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఢిల్లీలో తేల్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి.. అసలు ఇప్పుడు ఢిల్లీ కాలుష్య కాసారంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో అద్భుతంగా మెరవాల్సిన సందర్భం అటు రాధాకృష్ణపై.. ఇటు విజయసాయిరెడ్డి పై ఉంది. పులు కడిగిన ముత్యం లాగా వస్తే రాధాకృష్ణ దమ్మున్న జర్నలిస్ట్ అని.. సాన పెట్టిన వజ్రం లాగా మెరిస్తే విజయసాయిరెడ్డి దార్శనికత ఉన్న రాజకీయ నాయకుడని తేలిపోతుంది. అయితే ఇక్కడ విజయసాయిరెడ్డి విసిరిన సవాళ్లు.. చేసిన ట్వీట్లకు సంబంధించి ఒక వార్త కూడా సాక్షిలో ప్రముఖంగా రాలేదు. అసలు ఈ విషయాన్ని సాక్షి పత్రిక ఒక వార్త లాగా కూడా చూడలేదు.. అంటే ఈ లెక్కన రాధాకృష్ణ చెప్పింది నిజమా.. చేసిన ఆరోపణలే సత్యమా.. విజయ సాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినట్టేనా?!
శ్రీ రాధాకృష్ణ! ఆంధ్రజ్యోతిని కొనడానికి పెట్టుబడి పెట్టిన ఇద్దరు ప్రధాన వాటాదారులు ఏమయ్యారు. వారితో డబ్బు పెట్టించిన తర్వాత బ్లాక్ మెయిల్ చేసి పారదోలింది నిజం కాదా. విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేసే పారిశ్రామికవేత్త ఇప్పటికీ తన మిత్రుల దగ్గర నీ నయవంచన గురించి చెబ్తూనే…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2024