https://oktelugu.com/

Radhika Son: సీనియర్ హీరోయిన్ రాధికా గుర్తుందా..? ఆమె కొడుకు ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడో చూస్తే ఆశ్చర్యపోతారు!

తెలుగు లో ఈమె 'న్యాయం కావాలి' అనే చిత్రంతో మన ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నెగటివ్ షేడ్స్ ఉన్న హీరో క్యారక్టర్ లో కనిపించాడు. ఈ చిత్రంలో అద్భుతంగా నటించినందుకు గానూ రాధికా కి ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా దక్కింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 20, 2024 / 04:57 PM IST

    Radhika Son

    Follow us on

    Radhika Son: తెలుగు తమిళ భాషల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఎన్నో సంచలనాత్మక చిత్రాలలో నటించిన నటి రాధికా శరత్ కుమార్. ముఖ్యంగా ఈమె తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ఏకంగా 25 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఈ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 1973 వ సంవత్సరం లో ఈమె ‘కిజాకే పోగుమ్ రైల్’ అనే తమిళ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా, రాధికా కి ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. మొదటి సినిమాతోనే ఆ రేంజ్ ప్రభావం చూపించడంతో ఈమెకు తమిళం లో ఆఫర్స్ క్యూలు కట్టాయి. మరుసటి సంవత్సరంలో ఈమెకు తమిళం లో ఏకంగా 5 సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. అలా హిట్టు మీద హిట్టు కొడుతూ ఏడాది 10 నుండి 20 సినిమాల్లో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

    తెలుగు లో ఈమె ‘న్యాయం కావాలి’ అనే చిత్రంతో మన ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నెగటివ్ షేడ్స్ ఉన్న హీరో క్యారక్టర్ లో కనిపించాడు. ఈ చిత్రంలో అద్భుతంగా నటించినందుకు గానూ రాధికా కి ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా దక్కింది. అలా తెలుగు తమిళ భాషల్లో క్షణం తీరిక లేకుండా హీరోయిన్ గా రాణిస్తూ ఎవ్వరికీ అందనంత రేంజ్ కి వెళ్లిన రాధికా, ఇప్పటికీ కూడా సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ ముందుకు దూసుకుపోతుంది. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు, సీరియల్స్ ద్వారా కూడా ఈమె ఆడియన్స్ సుపరిచితురాలు. ముఖ్యంగా పిన్ని అనే సీరియల్ అప్పట్లో ఒక సెన్సేషన్. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఆమె అనేక సినిమాలు, సీరియల్స్ చేసింది.

    Radhika Son(1)

    ఇదంతా పక్కన పెడితే ఈమె ప్రముఖ తమిళ హీరో శరత్ కుమార్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. శరత్ కుమార్ కి రాధికా తో పెళ్లి జరిగే ముందే ఒక అమ్మాయితో పెళ్లి జరిగి విడాకులు కూడా అయ్యింది. మొదటి భార్య కి పుట్టిన అమ్మాయి వరలక్ష్మీ శరత్ కుమార్. ప్రస్తుతం ఈమె సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ లేడీ విలన్ గా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమె గురించి తెలియని వాళ్లంటూ ఎవ్వరూ లేరు కానీ, రాధికా మరియు శరత్ కుమార్ దంపతులకు జన్మించిన సంతానం గురించి మాత్రం ఆడియన్స్ కి అంత అవగాహన లేదు. ఈ దంపతులిద్దరికీ రయానే హార్డీ అనే కూతురు, రాహుల్ అనే కొడుకు ఉన్నారు. కూతురుకి 2016 వ సంవత్సరం లోనే పెళ్లి జరిగింది. కొడుకు రాహుల్ ప్రస్తుతానికి చదువుకుంటున్నాడు, భవిష్యత్తులో సినిమాల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. వీళ్ళ కుటుంబానికి సంబంధించిన ఫోటో ఒకటి ఎక్సక్లూసివ్ గా మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.