TTD
TTD: టీటీడీలో( Tirumala Tirupati Devasthanam) ఉన్న వివాదాలు చాలావున్నట్టు.. కొత్త వివాదాలకు అవకాశం కల్పిస్తున్నారు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు. తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తానని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. టీటీడీని సంస్కరిస్తానని చైర్మన్ బిఆర్ నాయుడు కూడా చాలా సందర్భాల్లో ప్రకటించారు. కానీ ప్రక్షాళన, సంస్కరణల మాట పక్కన పెడితే.. టీటీడీ చరిత్ర మసకబారేలా అనేక పరిణామాలు చోటు చేసుకోవడం ఆందోళనలకు గురిచేస్తోంది. టీటీడీ లడ్డూ వివాదం పెను దుమారానికి దారితీసింది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. అటు తరువాత తొక్కిసలాట ఘటనలో ఓ ఆరుగురు మృతి చెందడం.. టీటీడీ చరిత్రలోనే అత్యంత విషాదం. ఈ ఘటనల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సింది పోయి.. ఇంకా తప్పిదాలకు పాల్పడుతూనే ఉన్నారు.
* బాధ్యతాయుతమైన పదవిలో ఉండి
తాజాగా ఓ టీటీడీ( TTD) ఉద్యోగిపై బాధ్యతాయుతమైన టీటీడీ బోర్డు సభ్యుడు తిట్ల దండకంతో మనస్థాపానికి గురి చేశాడు. భక్తుల సమక్షంలోనే బూతులతో రెచ్చిపోయాడు. తనను మహాద్వారం మార్గం నుంచి వెలుపలికి పంపలేదని అక్కసుతో టీటీడీ ఉద్యోగి బాలాజీని బెంగళూరుకు చెందిన టిటిడి బోర్డు సభ్యుడు నరేష్ కుమార్( Naresh Kumar) నోటికొచ్చినట్టు మాట్లాడారు. చుట్టూ వందలాదిమంది భక్తుల సమక్షంలోనే చాలా రకాలుగా మాట్లాడి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్లు టీటీడీ బోర్డు సభ్యుడు తీరుపై తప్పు పడుతున్నారు.
* అడ్డగోలుగా మాట్లాడుతూ..
వాస్తవానికి ఇటీవల నిబంధనలు మార్చారు. బయోమెట్రిక్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇదే విషయంపై బాలాజీ సంబంధిత ట్రస్ట్ బోర్డు సభ్యుడిని కోరడంతో ఆయన తీవ్ర ఆవిగ్రహం వ్యక్తం చేశారు. ఎవడ్రా నువ్వు.. పోరా బయటికి… థర్డ్ క్లాస్ నా కొడకా.. ఫస్ట్ బయటకు పంపండి.. లేకుంటే ఇక్కడే కూర్చుంటా అని నరేష్ కుమార్ టిటిడి సిబ్బందిపై చిందులు వేశారు. తాను ఒక బాధ్యతాయుతమైన ట్రస్టు బోర్డు సభ్యుడు అన్న విషయం కూడా మరిచిపోయారు. చాలా చీప్ గా బిహేవ్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నడుస్తోంది. టీటీడీ బోర్డు సభ్యుడు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
*టీటీడీ పాలకవర్గం తీరుపై విమర్శలు
అయితే టీటీడీలో( TTD ) ఇంత జరుగుతున్నా.. ఇప్పటివరకు చైర్మన్ కానీ.. ఈవో కానీ.. ఇంతవరకు స్పందించకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీటీడీలో ఇటువంటి ఘటనలు నియంత్రించడానికి ట్రస్ట్ బోర్డు ఉందని… కానీ ఇంతవరకు స్పందించకపోవడం ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది. ఉద్యోగుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా టీటీడీ పాలకవర్గం స్పందించాల్సిన అవసరం ఉంది.
టీటీడీ ఉద్యోగిని థర్డ్ క్లాస్ నా కొడకా.. అంటూ గుడి బయటే బూతులు తిట్టిన టీటీడీ బోర్డు మెంబెర్
నిబంధనలు ప్రకారం బయటికి వెళ్లాలని చెప్పిన పాపానికి “ఎవడ్రా నువ్వు…పోరా బయటికి. థర్డ్ క్లాస్ నా కొడకా…ఫస్ట్ బయటికి పంపండి. లేకుంటే ఇక్కడే కూర్చుంటా” అంటూ శ్రీవారి గుడి… pic.twitter.com/hy0NJjjIf2
— greatandhra (@greatandhranews) February 19, 2025