Crime : అమ్మ ప్రేమంటే అదే.. బిడ్డ ప్రాణాలు కాపాడే క్రమంలో..

కుమారుడు సతీష్ విద్యుత్ బోర్డులో ప్లగ్ పెడుతుండగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. పక్కనే ఉన్న తల్లి సుందరమ్మ కుమారుడ్ని పక్కకు నెట్టింది. తాను విద్యుత్ షాక్ కు గురైంది. కళ్లెదుటే జరిగిన పరిణామంతో కుమారుడు సతీష్ షాక్ కు గురయ్యాడు.

Written By: Dharma, Updated On : May 7, 2023 3:02 pm

mother love

Follow us on

Crime : అమ్మ… అనిర్వచనీయమైన బంధం..ఓ అనుభూతి… ఓ అనుబంధం… ఓ ఆప్యాయత…ఓ ఆత్మీయత. బిడ్డకు బాధ కలిగిందన్న విషయం ముందు అమ్మకే తెలుస్తుందంటారు. ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందే అమ్మ మనసే పగిసగడుతుందంటారు. కంటికి కనురెప్పలా బిడ్డను కాపాడుతుందంటారు. బిడ్డ అపాయంలో ఉంటే తల్లడిల్లిపోతుంది. ఆ అపాయం ఏదో తనకు వచ్చి తన బిడ్డకు విముక్తి కలిగించాని భగవంతుడ్ని కోరుకుంటుంది. అటువంటి ఘటనే శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం అన్నంపేటలో వెలుగుచూసింది. ప్రమాదంలో ఉన్న బిడ్డను ప్రాణాపాయం నుంచి బయటపడేసి తాను తనువు చాలించింది.

అన్నంపేట గ్రామానికి చెందిన అంపోలు రాజులు, భార్య సుందరమ్మ, కుమారుడు సతీష్ తో కలిసి జీవిస్తున్నాడు. రాజులు దంపతులిద్దరూ వ్యవసాయ కూలీలు. రోజువారి పనులకు వెళితే కానీ పూటగడవదు. వారి కుమారుడు సతీష్ స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. శనివారం కుమారుడు సతీష్ విద్యుత్ బోర్డులో ప్లగ్ పెడుతుండగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. పక్కనే ఉన్న తల్లి సుందరమ్మ కుమారుడ్ని పక్కకు నెట్టింది. తాను విద్యుత్ షాక్ కు గురైంది. కళ్లెదుటే జరిగిన పరిణామంతో కుమారుడు సతీష్ షాక్ కు గురయ్యాడు. భర్త రాజులు కన్నీరుమున్నీరయ్యాడు.

రాజులు, సుందరమ్మ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కుమారుడు సతీష్ కు ఉన్నత చదువులు చదించాలని కలలు కన్నారు. అందుకు తగ్గట్టుగానే తాము కూలీ పనులకు వెళుతూ సతీష్ ను మాత్రం చదివిస్తున్నారు. సతీష్ ఏడో తరగతికి వస్తుండడంతో ఉన్నత చదువుల కోసం ఆలోచన చేస్తున్నారు. ఇంతలోనే మృత్యువు విద్యుత్ రూపంలో తల్లి సుందరమ్మను కబళించింది. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.