Homeజాతీయ వార్తలుBalineni Srinivas Reddy : సీఎం జగన్ కు షాక్ ఇచ్చిన బాలినేని

Balineni Srinivas Reddy : సీఎం జగన్ కు షాక్ ఇచ్చిన బాలినేని

Balineni Srinivas Reddy : మాజీ మంత్రి బాలినేని వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధినేత జగన్ పై అనుకూలంగా మాట్లాడుతూనే కొందరు పెద్దల తీరుపై బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనని.. చివరి వరకూ జగన్ వెంటే నడుస్తానని చెప్పుకొచ్చారు. అయితే తదుపరి పరిణామాలు చూస్తుంటే మాత్రం అనుమానం వ్యక్తమవుతోంది. రెండు వైపులా అనుమానాపు చూపులు మొదలు కావడంతో బాలినేని అడుగులు ఎటువైపు పడతాయోనన్న చర్చ అయితే జరగుతోంది. సందట్లో సడేమియా అన్నట్లు ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో సీఎం జగన్ తో పాటు అదే జిల్లాకు చెందిన పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫొటోలు లేకపోవడం కలకలం సృష్టిస్తోంది.

ఆ ఆరోపణలతో ఆవేదన..
తెలంగాణకు చెందిన గోనె ప్రకాశరావు బాలినేనిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన చేసిన అవినీతిని ప్రస్తావించారు. త్వరలో బాలినేని టీడీపీలోకి వెళుతున్నట్టు కూడా ప్రకటించారు. అదీ కూడా తిరుపతి వేదికగా ప్రకటించారు. తిరమల శ్రీవారి దర్శనం అనంతరం మీడియతో మాట్లాడుతూ బాలినేనిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో బాలినేని వ్యతిరేక నేత అయిన వైవీ సుబ్బారెడ్డిని పొగిడారు. దీంతో ఇది వివాదాస్పదమైంది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. తన వెనుక పార్టీ పెద్దలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గోనె ప్రకాశరావు వెనుక పార్టీ కీలక నేత ఒకరున్నారని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో తాను టిక్కెట్లు ఇప్పించిన వారే.. తనపై హైకమాండ్ కు ఫిర్యాదులు చేస్తున్నారని వాపోయారు. ఇక నుంచి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికే పరిమితమవుతానని ప్రకటించారు.
ప్రోటోకాల్ పాటించకుండా..
అయితే తాజాగా ఒంగోలులో మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటుచేశారు. వీటి ప్రారంభోత్సవం వాయిదాపడినా.. అక్కడ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు మాత్రం వివాదాస్పదమవుతున్నాయి. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదు. సీఎం జగన్ ఫొటో కానీ.. అదే జిల్లాకు చెందిన మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫొటోలు అందులో లేవు.దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. బాలినేని కఠిన నిర్ణయం దిశగా అడుగులేస్తున్నారన్న టాక్ ప్రారంభమైంది. అమీతుమీకి సిద్ధమని హైకమాండ్ కు స్పష్టమైన సంకేతాలిచ్చినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

రంగంలోకి దూతలు..
మరోవైపు హైకమాండ్ దూతలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. బాలినేనితో మాట్లాడి బుజ్జగించేందుకు తాడేపల్లి నుంచి ముఖ్య నేతలు ప్రయత్నాలు చేసారు. కానీ, బాలినేని మాత్రం తన నిర్ణయం పైన పునరాలోచన లేదని సన్నిహితులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. తాను ఒంగోలు నియోజకవర్గానికి పరిమితం అవుతానని తేల్చి చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని.. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ గెలిచేందుకు పూర్తిగా సహకారం అందిస్తానని సన్నిహితులతో స్పష్టం చేసారు. అయితే, ప్రాంతీయ ఇంఛార్జ్ గా జిల్లాల్లో నేతలకు హామీలు ఇస్తున్న సమయంలో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ముఖ్యులపైన ఉంటుందని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version