Homeక్రీడలుPele : డిక్షనరీలోకి ఎక్కిన ‘పీలే’..దానికి అర్థం ఏంటో తెలుసా?

Pele : డిక్షనరీలోకి ఎక్కిన ‘పీలే’..దానికి అర్థం ఏంటో తెలుసా?

Pele : ఫుట్ బాల్ లెజెండ్ పీలే కు మరణం తరువాత అరుదైన గౌరవం దక్కింది. బ్రెజిల్ లో అత్యంత ప్రజాదరణ పొందిన పోర్చుగీస్ భాషా మైఖెలిస్ ఢిక్షనరీలో ‘పీలే’ను చేర్చింది. పీలే అంటే ‘ఆసాధారణమైన లేదా సాటిలేని ప్రత్యేకమైన’ అనే అర్థం వచ్చేలా పీలే పేరును అక్కడి ప్రభుత్వం నమోదు చేసింది

మూడు సార్లు ప్రపంచకప్ ను గెలిచిన ఆటగాడిగా మాత్రమే కాకుండా ఆ క్రీడలో లెజెండ్ గా పేరొందిన పీలే తన 82వ ఏట మరణించారు. ఆయన మరణం బ్రెజిల్ దేశస్థులకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్ బాల్ ఆటగాళ్లను కలిచివేసింది. ఫుట్ బాల్ క్రీడలో ఎవరూ నమోదు చేయని రికార్డులను పీలే సృష్టించాడు. ఈ నేపథ్యంలోనే బ్రెజిల్ ప్రభుత్వం అతనిని గౌరవించింది.

1940 అక్టోబర్ 23న పీలె జన్మించారు. ఆయన పూర్తి పేరు ఎడ్సన్ ఆనండెస్ డో నాసిమియాంటో. 16 ఏళ్ల వయసులోనే ఆయన బ్రెజిల్ తరుపున అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడలోకి ఎంట్రీ ఇచ్చాడు. 1958, 1962, 1974 వరకు బ్రెజిల్ క్లబ్ శాంటోస్ తరుపున బరిలోకి దిగి 659 మ్యాచుల్లో 643 గోల్ఫ్ చేశాడు. అర్జెంటినా దిగ్గజం డిగో మారడోనాతో కలిపి పీలే ‘ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ’ అవార్డును సొంతం చేసుకున్నారు. 1958 లో బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నారు.

దాదాపు 20 ఏళ్ల పాటు పీలే ఫుట్ ప్రయాణం అత్యంత ఆసక్తిగా సాగింది. మొత్తంగా ఆయన రికార్డు స్థాయిలో 1,281 గోల్స్ చేశాడు. పీలేకు రోజ్మెరీ డోస్ రీస్ చోల్సి, అస్పిరియా లెమోస్ సీక్సాస్, మార్సియా అయోకీ అనే ముగ్గురు భార్యలు ఉన్నారు. ఫుట్ బాల్ క్రీడలో అత్యంత ప్రావీణ్యం సంపాదించిన ఆయన పెద్ద ప్రేగు క్యాన్సర్ తో బాధపడేవారు. ఆయన 82 ఏళ్ల వయసులో 2022 డిసెంబర్ 29న తుది శ్వాస విడిచారు.

పీలే ఫుట్ బాల్ క్రీడలో అసాధారణమైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. అందుకే ఆయన పేరు చిరస్థాయిగా ఉండేలా బ్రెజిల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీలేను ఎప్పటికీ ఆసాధారణమైన వ్యక్తిగా అనిపించుకునేలా అదే అర్థం వచ్చేలా ‘పీలే’ను డిక్షనరీలో చేర్చారు.  ఆయనకు గౌరవం ఇచ్చే విధంగా డిక్షనరీలో పీలే పేరు చేర్చడంపై ఫుల్ బాల్ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version