Konaseema District : మాతృత్వం కోసం పరితపించిన తల్లి.. ఒకే కాన్పులో ముగ్గురు.. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు

గ్రామీణ ప్రాంతాల్లో వివాహం జరిగిన ఏడాదికే పిల్లల కోసం ఎక్కువమంది ఆరా తీస్తుంటారు. అంతకుమించి ఆలస్యమైతే ఎన్నో రకాల అవమానాలు ఎదురవుతాయి. అటువంటి పరిస్థితిని ఐదేళ్ల పాటు ఎదుర్కొన్న ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది.

Written By: Dharma, Updated On : September 1, 2024 12:04 pm

Three in one litter

Follow us on

Konaseema District : వారికి వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అవుతోంది. కానీ పిల్లలు పుట్టలేదు. దీంతో ఎన్నో ఆసుపత్రులను తిరిగారు. మందులు కూడా వాడారు. కానీ ఫలితం లేకపోయింది. చివరకు ఓ వైద్యురాలు సలహాతో మందులు వాడారు. ఆమె గర్భం దాల్చింది. ఏకంగా ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. దీంతో ఆ ఇంట సంతోషం అంతా ఇంతా కాదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వెలుగు చూసింది ఈ ఘటన. ఎందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రాజానగరం మండలం పాత తుంగపాడు గ్రామానికి చెందిన ఆలపాటి సంధ్య కుమారికి వీరబాబుతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. కానీ ఇంతవరకు వారికి పిల్లలు లేరు. దీంతో చాలా ఆసుపత్రులు వారు తిరిగారు. చివరికి రామచంద్రాపురం బ్రాడీపేటలో ఉన్న శారదా నర్సింగ్ హోమ్ ను ఆశ్రయించారు. డాక్టర్ గిరి బాల వైద్య పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. దీంతో సంధ్య కుమారి గర్భం దాల్చింది. ఇటీవల పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రిలో చేరింది. డాక్టర్ గిరి బాల, డాక్టర్ శ్రావ్య బృందం ఆపరేషన్ చేశారు. ఒకే కాన్పులో ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్లలకు పురుడు పోశారు. పిల్లలు లేరని చాలా ఆసుపత్రులు తిరిగిన ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

* ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స
అయితే వారిది సాధారణ కుటుంబం కావడంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఈ శాస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం పుట్టిన ఆ ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. కనీస బరువుతోనే ఉన్నట్టు వైద్యులు చెప్పారు. పిల్లలు పుట్టాలని ఎన్నో ఆసుపత్రులు తిరిగి అలసిపోయి నిరాశ చెందిన దంపతులు.. ముగ్గురు పిల్లలు పుట్టడంతో ఎంతో ఆనందిస్తున్నారు.

* అదో అవమానంగా
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వివాహం జరిగిన ఏడాదికే పిల్లల కోసం ఆరా తీస్తారు. అటువంటిది ఐదేళ్లు అవుతున్న సంధ్య కుమారికి పిల్లలు లేకపోవడంతో ఆమె అవమానంగా ఫీల్ అయ్యారు. భర్తకు సైతం ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో వారు చాలా ఆసుపత్రులను తిరిగారు. విపరీతంగా మందులు వాడారు. అయితే చివరకు వైద్యురాలు డాక్టర్ గిరి బాల సూచనలతో మందులు వాడారు. ఆమె స్వయంగా ముగ్గురు పిల్లలకు పురుడు పోయడంతో.. వారు వైద్యురాలికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

* స్థానికుల ఆసక్తి
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టడం, ఆరోగ్యంగా ఉండడంతో వారిని చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు పిల్లలు లేని వారికి మందులు ఇచ్చి.. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించి.. ముగ్గురు పిల్లలకు పురుడు బోయడంతో ఆసుపత్రి పేరు మార్మోగుతోంది. చాలామంది పిల్లలు లేనివారు ఆశ్రయించడం ప్రారంభించారు.