Bapatla: ఇంటి కోసం ఇసుక.. అందులో తల లేని బాడీ.. బాపట్లలో సంచలనం

సాధారణంగా నదుల్లో ఇసుక తవ్వకాలు చేపడతారు. అక్కడి నుంచి ఇసుక నిల్వ కేంద్రాలకు తరలిస్తారు. అనుమతులు మేరకు ఇసుక సరఫరా చేస్తారు. అయితే ఇసుక ఎక్కడి నుంచి తెచ్చారు? ఎలా తెచ్చారు అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.

Written By: Dharma, Updated On : April 13, 2024 2:58 pm

Bapatla

Follow us on

Bapatla: కొన్ని ఘటనలు వింటేనే భయపడిపోతాం. చూస్తే మరిచిపోలేం. అటువంటి ఘటనే బాపట్ల జిల్లా ఈపురుపాలెం లో జరిగింది.బాపట్ల పట్టణానికి పదికిలోమీటర్ల దూరంలో ఒక వ్యక్తి ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాడు. అందుకు అవసరమైన ఇసుక కోసం నాలుగు రోజుల కిందట ఒక కాంట్రాక్టర్ తో ఒప్పందం చేసుకున్నాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ అదే రోజు రాత్రి ఇసుకను లారీల్లో తెచ్చి అప్పగించాడు. శుక్రవారం ఇసుకను ఎక్స్ కవేటర్ సాయంతో పునాదుల్లో పోస్తుండగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆ ఇసుకలో డెడ్ బాడీ కనిపించింది. తల లేకుండా మొండెంతో ఉన్న మృతదేహం కలకలం సృష్టించింది.

సాధారణంగా నదుల్లో ఇసుక తవ్వకాలు చేపడతారు. అక్కడి నుంచి ఇసుక నిల్వ కేంద్రాలకు తరలిస్తారు. అనుమతులు మేరకు ఇసుక సరఫరా చేస్తారు. అయితే ఇసుక ఎక్కడి నుంచి తెచ్చారు? ఎలా తెచ్చారు అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. మొండెం లేని మృతదేహం కావడం, ఎడమ చేయి చిన్నదిగా ఉండడం, కుడి చేతి మీద లవ్ సింబల్ తో పాటు ఎల్లో కలర్ తాడు కట్టి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

అయితే మృతదేహం ఆనవాళ్లను చూస్తే మాత్రం ఫ్రీ ప్లాన్ మర్డర్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడిని గుర్తించకుండా మొండాన్ని వేరు చేశారని భావిస్తున్నారు. ఆనవాళ్లు లేకుండా ఇసుకలో కప్పేసారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సాధారణంగా నదుల్లో ఇసుక తవ్వకాలు జరుగుతాయి. నది తీరాల్లోనే మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతుంటాయి. దీంతో ఎవరైనా అంత్యక్రియలు చేసిన తర్వాత.. ఎక్స్ కవెటర్ తో తవ్వకాలు జరిపారా? ఆ సమయంలోనే మొండెం వేరైందా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.