Telugu Debut Heroines: తెలుగులో ఒక్క సినిమా రిలీజ్ అవ్వకుండానే వరుస ఆఫర్లు కొట్టేస్తున్న హీరోయిన్లు వీళ్లే…

ఆ హీరోయిన్ మిగతా భాషల్లో ఉన్న ఆయా దర్శకుల సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ ముందుకెళ్తున్నారు. వాళ్ళ క్రేజ్ ను వాడుకుంటూనే దర్శకులు మంచి సక్సెస్ లను సాధించాలని చూస్తున్నారు.

Written By: Gopi, Updated On : April 13, 2024 2:54 pm

Telugu Debut Heroines

Follow us on

Telugu Debut Heroines: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల కంటే హీరోయిన్ హవా ఎక్కువగా పెరిగిపోతుంది. ఇక ప్రస్తుతం ఒక భాషలో ఒక సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంటే ఆ హీరోయిన్ మిగతా భాషల్లో ఉన్న ఆయా దర్శకుల సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ ముందుకెళ్తున్నారు. వాళ్ళ క్రేజ్ ను వాడుకుంటూనే దర్శకులు మంచి సక్సెస్ లను సాధించాలని చూస్తున్నారు.

ఇక దేవర సినిమాతో అలనాటి అతిలోక సుందరి అయిన ‘శ్రీదేవి’ కూతురు “జాన్వీ కపూర్” ని ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ సెలెక్ట్ అయింది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు…ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ లో వచ్చిన “యారియన్ 2” సినిమాలో హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ కూడా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలకు కమిట్ అవుతుంది.

ఇక ఇప్పటికే ఈమె రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో సెలెక్ట్ అయింది. ఇక దాంతో పాటుగా నానితో కూడా మరొక సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇలా హీరోయిన్లు తెలుగులో ఒక సినిమా కూడా రిలీజ్ చేయకుండానే వరుసగా ఛాన్స్ లను కొట్టేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి హీరోలు ఎంత కష్టపడి సినిమాలు చేసిన అవి సక్సెస్ సాధిస్తేనే వాళ్లకి మంచి క్రేజ్ అయితే వస్తుంది. కానీ హీరోయిన్స్ ఒక లాంగ్వేజ్ లో సూపర్ సక్సెస్ అయిన వెంటనే మరొక భాషలో స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.

ఇక ఈ విషయంలో హీరోయిన్లు మాత్రం లక్కీ ఛాన్స్ కొడుతున్నారనే చెప్పాలి. ఇక ఇప్పుడు జాన్వీ కపూర్ అయిన భాగ్య శ్రీ కి అయిన వరుస ఆఫర్లు వచ్చాయి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.ఇక ఈ సినిమాలతో వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకొని సక్సెస్ సాధిస్తేనే వాళ్ళు ఫ్యూచర్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఆ తర్వాత కూడా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటారు…